Weather Delhi: ఓరి దేవుడా.. ముంచుకొస్తున్న భారీ వర్షం.. ఈ జిల్లాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్..!

రాజస్థాన్‌లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. MP, UP, ఢిల్లీ, HP, బీహార్‌లలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు ఢిల్లీ NCRలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

New Update
Rains

Weather Delhi

Weather Delhi:

దేశ వ్యాప్తంగా కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అదే సమయంలో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికి పలు రాష్ట్రాల్లో వరదల కారణంగా ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో భాగంగా భారత వాతావరణ శాఖ (IMD) నేడు దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది. 

ఇది కూడా చూడండి: బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఇచ్చి.. పోర్న్ చూపించి.. సృష్టి స్పెర్మ్ దందాలో సంచలన విషయాలు!

రాజస్థాన్‌లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు విధ్వంసం

ముఖ్యంగా ఇవాళ రాజస్థాన్‌లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు విధ్వంసం సృష్టిస్తుండటంతో ఆయా జిల్లాలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో పాటు అధికారులు 5 రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే మలబార్ తీరంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తూర్పు రాజస్థాన్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని కారణంగా అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారు. 

ఇది కూడా చూడండి: కాల్పుల్లో పోలీస్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు మృతి

5 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్(Today Weather)

అలాగే మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజధాని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

ఇది కూడా చూడండి: కుక్క ఫ్యామిలీకి రెసిడెన్సీ సర్టిఫికెట్‌.. ఎక్కడో తెలిస్తే షాక్!

ఢిల్లీలో చీకటి మేఘాలు (Delhi Temperature)

దీంతోపాటు రాజధాని ఢిల్లీలో ఉదయం ఆకాశంలో చీకటి మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం.. నేడు(Delhi Weather Today), రేపు ఢిల్లీ NCRలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీనివల్ల ఉష్ణోగ్రత కూడా తగ్గుతుందని పేర్కొంది. 

Advertisment
తాజా కథనాలు