/rtv/media/media_files/2025/02/03/EmSZdHD6RPWQeQfSB0fY.jpg)
trump and modi
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే మోదీ అమెరికా, ఫ్రాన్స్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. అమెరికా పర్యటనలో భాగంగా 2025 ఫిబ్రవరి 13న వాషింగ్టన్‌లో ట్రంప్‌ను కలవనున్నట్లుగా తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు, రక్షణ, సాంకేతిక సహకారంపై ఈ సమావేశం జరగవచ్చునని తెలుస్తోంది. అయితే ఈ పర్యటనపై మూడు రోజుల క్రితం స్పందించిన భారత విదేశాంగశాఖ.. రెండు దేశాలు దీనిపై కసరత్తు చేస్తున్నాయని వెల్లడించింది.
Also Read : Basti Ali : అభిషేక్ నీ ఆటకు ఫిదా.. పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు
అమెరికా కంటే ముందు ఫిబ్రవరి రెండో వారంలో మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తో్ంది. అక్కడ నుంచి 12వ తేదీన వాషింగ్టన్‌కు చేరుకోనుని 14వరకు అక్కడే పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ట్రంప్‌తో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం కార్పొరేట్ దిగ్గజాలు, ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం ఉంటుందని తెలుస్తోంది.
ట్రంప్‌తో ఫోన్‌లో
ఇటీవల ప్రధాని మోదీ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని పీఎం సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో వెల్లడించింది. ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ, నా స్నేహితుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడటం చాలా ఆనందంగా ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టడం పట్ల మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రజల సంక్షేమం, ప్రపంచ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం మేము కలిసి పని చేస్తామని మోదీ అన్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రత్యేక ప్రతినిధిగా పాల్గొన్నారు. ప్రధాని మోదీ రాసిస ప్రత్యేక లేఖను కూడా ఆయన ట్రంప్‌కు అందజేశారు. కాగా తొలి విడత పాలనలో ట్రంప్ భారత్ పర్యటనలకు వచ్చారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆయన పర్యటించారు.
Also Read : Jani Master : జానీ మాస్టర్కు గ్రాండ్ వెల్కమ్.. కొరియోగ్రాఫర్ ఎమోషనల్