Basti Ali : అభిషేక్ నీ ఆటకు ఫిదా.. పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు

అభిషేక్ ఆటకు ఫిదా అయిపోయానని కామెంట్ చేశాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ . రాబోయే ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్‌ తరఫున సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాలని కోరుకున్నాడు. ట్రావిస్‌ హెడ్‌ను మించి అభిషేక్ ఆటతీరు ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

New Update
abishek, Basti Ali

abishek, Basti Ali

ముంబై వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన ఐదో వన్డేలో టీమిండియా యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ దుమ్ముదులిపేశాడు.   54 బంతుల్లో ఏకంగా 135 పరగులు చేసి వీరవిహారం చేశాడు.  అతని ఇన్నింగ్స్ లో 13 సిక్సర్లు,7  ఫోర్లు ఉన్నాయి. అతని ఆటకు ఇంగ్లండ్ బౌలర్లు చేతులెత్తేయగా... అభిమానులు చప్పట్లో ఎంకరెజ్ చేశారు.  అతనికి ఆటకు అభిమానులే కాదు ఆటగాళ్లు కూడా ఫిదా అయిపోయారు. తాజాగా అభిషేక్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ప్రశంసల వర్షం కురిపించాడు. 

సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాలి 

అభిషేక్ ఆటకు ఫిదా అయిపోయానని కామెంట్ చేశాడు. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్‌ తరఫున సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాలని కోరుకున్నాడు. ట్రావిస్‌ హెడ్‌ను మించి అభిషేక్ ఆటతీరు ఉంటుందని  బసిత్ అలీ  అభిప్రాయపడ్డాడు.  వీరిద్దరి జోడీని చూస్తే షోలే సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర గుర్తొస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. 

ఇక అభిషేక్ తనకు మద్దతుగా నిలిచిన మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్, కోచ్‌ గౌతమ్ గంభీర్, కెప్టెన్‌ సూర్యకుమార్ యాదవ్‌లను గౌరవించిన విషయాన్ని కూడా బసిత్ అలీ గుర్తు చేసి ప్రశంసించాడు.  కాగా 2024 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫైనల్‌ చేరడంలో హెడ్, అభిషేక్ జోడీది కీలకపాత్ర పోషించారు. హెడ్ 15 ఇన్నింగ్స్‌ల్లో 191.55  స్ట్రైక్ రేట్‌తో 567 పరుగులు చేయగా.. అభిషేక్ 16 ఇన్నింగ్స్‌ల్లో 204.21 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. 

Also read :  కూతురు ప్రేమ వివాహం.. పెళ్లి చేసిన వ్యక్తిని చంపేందుకు భారీ సుపారి!

ఇక ఇంగ్లండ్ తో జరిగిన ఐదో వన్డేలో టీమిండియా  150 పరుగులతో భారీ విజయాన్ని అందుకుంది.  ఈ మ్యాచ్ లో భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్‌ చేతులెత్తేసింది. కేవలం 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  దీంతో 4-1తో సిరీస్ ను సొంతం చేసుకుంది.

Also Read :  చంద్రముఖి సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్స్... రీమేక్ అని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు