NIA చేతికి ఢిల్లీ పేలుళ్ల కేసు.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం!

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడి దేశాన్ని ఉలిక్కపడేలా చేసింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బాంబు దాడి ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది.

New Update
Ministry of Home Affairs hands over Delhi car blast case to the National Investigation Agency (NIA)

Ministry of Home Affairs hands over Delhi car blast case to the National Investigation Agency (NIA)

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడి దేశాన్ని ఉలిక్కపడేలా చేసింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బాంబు దాడి ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది. దీంతో మరికొన్ని రోజుల్లోనే ఈ బాంబు దాడికి సంబంధించి వివరాలు బయటికి రానున్నాయి. మరోవైపు ఈ దాడిపై తాజాగా స్పందించిన ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడికి పాల్పడ్డ నిందితులను ఎట్టిపరిస్థితుల్లో వదిలేది లేదని తేల్చిచెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. ఈ దాడికి గల కారణాలను దర్యాప్తు  అధికారులు వెల్లడిస్తారని పేర్కొన్నారు. పేలుడ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.  

Also Read: డిల్లీ పేలుడు కేసులో కీలక పరిణామం: అదుపులోకి ఉమర్ కుటుంబ సభ్యులు!

ప్రధాని మోదీ ప్రస్తుతం భూటాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ దాడి ఘటనపై రాజ్‌నాథ్‌ సింగ్ కూడా మాట్లాడారు. దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని.. త్వరలోనే ఈ దాడికి సంబంధించిన వివరాలు బయటపెడతామని చెప్పారు. ఇదిలాఉండగా సోమవారం సాయంత్రం 6:52 గంటలకు ఎర్ర కోట సమీపంలో బాంబ్‌ బ్లాస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. 

Also Read: ఢిల్లీ బాంబు పేలుడు.. హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ!

i20 కారులో ఈ పేలుడు జరిగింది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియోలు బయటకు వచ్చాయి. అయితే ఆ కారు నడుపుతున్న వ్యక్తిని డా.ఉమర్‌ నబీ అని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు గత రెండ్రోజుల నుంచి ఉగ్రకుట్రల్లో భాగమవుతున్న వాళ్లని పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. వాళ్లలో ఐదురుగు వైద్యులే ఉన్నారు.  

Advertisment
తాజా కథనాలు