Migraine: వేడి నీటిలో పాదాలు ఉంచితే మైగ్రేన్ పోతుందా? మైగ్రేన్ తలలో భరించలేని నొప్పిగా ఉంటుంది. వేడి నీటిలో పాదాలను నానబెట్టడం వల్ల మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. వేడినీటిలో పటిక, లావెండర్ ఆయిల్, ఆముదం నూనెను కలినితే ఎఫెక్టివ్‌గా ఉండదని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Nov 2024 in లైఫ్ స్టైల్ Short News New Update షేర్ చేయండి 1/6 ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు వల్ల ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అలాంటి వాటిల్లో మైగ్రేన్ ఒకటి. అయితే మైగ్రేన్ విషయంలో పాదాలను వేడి నీటిలో నానబెట్టడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది నిజంగా పని చేస్తుందా..? ఈ వాదన నిజమేనా, డాక్టర్లు ఏం చెబుతున్నారో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం. 2/6 మైగ్రేన్ అంటే తీవ్రమైన తలనొప్పి ఈ రోజుల్లో చాలామంది దాని బాధితులు ఉన్నారు. మైగ్రేన్‌లో తలలోని ఏదైనా ఒక భాగంలో భరించలేని నొప్పి ఉంటుంది. అ సమయంలో రోగి మందులు వేసుకున్న గంటల తర్వాత ఉపశమనం లభిస్తుంది. 3/6 ప్రస్తుతం సోషల్ మీడియాలో మైగ్రేన్‌కు హోం రెమెడీ గురించి వేడి నీటిలో పాదాలను నానబెట్టడం వల్ల మైగ్రేన్ నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు. మైగ్రేన్ నొప్పితో బాధపడుతుంటే.. మీ పాదాలను వేడి నీటిలో ఉంచడం వల్ల ఉపశమనం లభిస్తుంది. 4/6 ఈ పద్ధతి వల్ల కాళ్ల రక్తనాళాలు రిలాక్స్ అవుతాయని, మైగ్రేన్ నొప్పి తగ్గుతుంది. ఒక వ్యక్తి తన పాదాలను వేడినీటిలో ఉంచినప్పుడు అది పాదాల వైపు రక్తప్రసరణను పెంచుతుందంటున్నారు. ఇది మెదడు నుంచి రక్తపోటును తగ్గిస్తుంది, మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం అందిస్తుందన్నారు. 5/6 మైగ్రేన్ నొప్పికి చికిత్స చేయడానికి పెయిన్ కిల్లర్లు, స్ప్రేలు, ధ్యానం, యోగాతోపాటు అనేక ఇతర చర్యలను ప్రయత్నిస్తారని వైద్యులు చెబుతున్నారు. కానీ వేడి నీటి చికిత్స కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. 6/6 వేడినీరు 37 నుంచి 43 డిగ్రీల మధ్య ఉండాలి. పాదాలను నానబెట్టడానికి పెద్ద టబ్ లేదా బేసిన్ ఉపయోగించాలి. కొద్దిగా పటిక, లావెండర్ ఆయిల్, ఆముదం మొదలైన ఏదైనా ముఖ్యమైన నూనెను వేడి నీటిలో కలపాలని చెబుతున్నారు. #migraine మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి