తమిళ రాజకీయాల్లో 'చిన్నమ్మ' సంచలనం.. శశికళ కొత్త రాజకీయ పార్టీ ఆవిష్కరణ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ తన రాజకీయ ప్రస్థానంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. జయలలిత జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె తన కొత్త రాజకీయ పార్టీ జెండాను ఆవిష్కరించి, ప్రత్యర్థులకు సవాల్ విసిరారు.

New Update
_political party in Tamil Nadu

తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ కుదుపు చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు వి.కె.శశికళ తన రాజకీయ ప్రస్థానంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. జయలలిత జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె తన కొత్త రాజకీయ పార్టీ జెండాను ఆవిష్కరించి, ప్రత్యర్థులకు సవాల్ విసిరారు.

అమ్మని తలుచుకొని ఎమోషనల్

నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో రూపొందించిన ఈ జెండా మధ్యలో ద్రవిడ రాజకీయ దిగ్గజాలు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత ముఖచిత్రాలను పొందుపరిచారు. తద్వారా తానే 'అమ్మ' అసలైన రాజకీయ వారసురాలినని శశికళ కేడర్‌కు బలమైన సంకేతాలు పంపారు. సభలో ప్రసంగిస్తూ శశికళ ఎమోషనల్ అయ్యారు. జయలలిత మరణం తర్వాత తనపై జరిగిన కుట్రలను గుర్తు చేసుకుంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. "జయలలితను నేనే హత్య చేశానని దుష్ప్రచారం చేసి నా మనసును గాయపరిచారు. అప్పట్లో నేను దుఃఖంలో ఉన్నందుకే పదవుల పట్ల ఆసక్తి చూపలేదు. కానీ నా మౌనాన్ని అసమర్థతగా భావించారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పళనిస్వామి, పన్నీర్‌ సెల్వంపై ధ్వజం

ప్రస్తుత అన్నాడీఎంకే అగ్ర నాయకత్వంపై ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేయడం నేను చేసిన అతి పెద్ద పొరపాటు. పీఠం ఎక్కిన తర్వాత నన్ను ఒక చిత్తుకాగితంలా విసిరేసి, పార్టీ నుంచి బహిష్కరించారు" అని మండిపడ్డారు. పన్నీర్‌ సెల్వం వైఖరిని కూడా ఆమె తప్పుపట్టారు.

ఇక నా మార్క్ చూపిస్తా!

తమిళనాట ఇకపై తన మార్క్ రాజకీయం చూపిస్తానని శశికళ ప్రకటించారు. ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని, పార్టీ పేరు మరియు విధివిధానాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఈ పరిణామంతో అన్నాడీఎంకే శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

Advertisment
తాజా కథనాలు