KTR: లగచర్ల రైతులతో కేటీఆర్ ములాఖత్.. రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల బాధిత రైతులతో మలాఖత్ అయి పరామర్శించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాబంధులా వచ్చి పేదల భూములను కొల్లగొడుతున్నాడని విమర్శించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. By B Aravind 15 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన రోజురోజుకి ముదురుతోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు బీఆర్‌ఎస్ నేతలు సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల బాధిత రైతులతో మలాఖత్ అయి పరామర్శించారు. ఆ తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. '' కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నాయకులతో లగచర్ల బాధితులను కలిశాం. లగచర్లలో పేదల భూమి సేకరించే విషయంలో వాళ్లకు అన్యాయం చేస్తున్నారు. లక్షల రూపాయల విలువ చేసే భూములకు తక్కువ ధరలకు ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లగచర్ల సహా భూమి కోల్పోతున్న రైతులు తీవ్రంగా రోదిస్తున్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి రాబంధులా వచ్చి పేదల భూములను కొల్లగొడుతున్నాడు. గతంలో ఫార్మా అంటే కాలుష్యం అన్న రేవంత్ రెడ్డియే ఇప్పుడు ఏ విధంగా 3 వేల ఎకరాలు తీసుకుంటున్నాడు. జైల్లో ఇప్పుడు మేము 16 మందిని కలిశాం. వాళ్ల బాధ చెప్పలేని విధంగా ఉంది. అందులో ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి పెట్టిన కులగణన కార్యక్రమంలో ఉన్న ఉద్యోగిని సాయంత్రం దాడిలో పాల్గొన్నాడంటూ తీసుకెళ్లారు. KTR Met With Lagacharla Farmers Also Read: మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొన్న అది అత్యాచారమే: బాంబే హైకోర్టు ఇంకొక తమ్ముడు వనపర్తిలో చదువుకుంటున్నాడు. గొడవ జరిగిన విషయం తెలిసి ఇంటికి వస్తే ఆయనను కూడా జైలుకు తీసుకొచ్చారు. సంఘటనతో సంబంధం లేని వాళ్లను జైల్లో పెట్టారు. ముందు 60, 70 మందిని అరెస్ట్ చేశారు. దాడి చేసిన వాళ్లలో కాంగ్రెస్ నాయకులే ప్రధానంగా ఉన్నారు. దుద్యాల కాంగ్రెస్ అధ్యక్షుడి అనుచురులు దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. కానీ పోలీసులకు మాత్రం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఫోన్‌లో డైరెక్షన్స్ ఇచ్చి వీళ్లను కొట్టించాడు. ముఖ్యమంత్రి సోదరుడున్న ఒకే ఒక్క అర్హతతో తిరుపతి రెడ్డి కొడంగల్‌లో రాజ్యాంగేతర శక్తిగా మారాడు. కలెక్టర్ సహా పోలీసులు, అధికారులు ఆయన ముందు మోకరిల్లే విధంగా రారాజుగా వ్యవహరిస్తున్నాడు. కొడంగల్‌లో ముఖ్యమంత్రిది ఏమీ నడవదంట. అంతా తిరుపతి రెడ్డిదే చెల్లుతుందని చెబుతున్నారు. నిజానికి దాడి చేసిన వారిలో కాంగ్రెస్ వాళ్లు కూడా ఉన్నారు. భూములు పోతాయని వాళ్లే దాడి చేశారు. కానీ అరెస్ట్ చేసిన 70 మందిలో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్లు అని గుర్తించి 21 మందిని మాత్రమే చిత్ర హింసలు పెట్టి కేసులు పెట్టారు. Also Read : నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై...! మిగతా కాంగ్రెస్ వాళ్లను వదిలేశారు. కానీ దాడి జరిగిన వీడియోల్లో కాంగ్రెస్ వాళ్లు కనబడుతున్నారు. ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్లు మాత్రమే చేశారని చెప్పాలని కుట్ర చేస్తున్నారు. వాళ్ల చేతగానితనాన్ని, అధికారులకు, ప్రభుత్వానికి జరిగిన పరాభవానికి ఏం చెప్పాలో తెలియక దీనికి రాజకీయ రంగు పులిమారు. 21 మంది రైతులు అంతా కూడా పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే. వికారాబాద్ ఎస్పీ, సీఐ వారిని చిత్ర హింసలు పెట్టారు. మూడు గంటల పాటు కొట్టారు. Also Read: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. రిలేషన్‌షిప్‌లో ముద్దులు, హగ్‌లు సహజమే 21 మంది రైతులు బయటకు వచ్చే వరకు బీఆర్ఎస్ వారికి న్యాయసాయంతో పాటు అండగా ఉంటుంది. 60, 70 లక్షలు విలువ చేసే భూమికి 10 లక్షలు ఇస్తా అంటే రైతులు ఒప్పుకుంటారా?. సంగారెడ్డి న్యాల్‌కల్ వద్ద కూడా భూసేకరణ విషయంలో దాడి జరిగింది. కేసీఆర్ ఫార్మాసిటీ కోసం హైదరాబాద్‌లో 14 వేల ఎకరాలు సేకరిస్తే దాన్ని వద్దని ఆ భూముల్లో రేవంత్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా సరే మేము ఎదుర్కొంటాం. మీ తరఫున పోరాటం చేస్తాం. ఫార్మా విలేజ్‌ల పేరుతో రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే భూముల దందా చేస్తున్నారో ఆయా ప్రాంతాల్లో రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. బీఆర్ఎస్.. పేదలు, ప్రభుత్వ బాధితుల తరఫున పోరాటం చేస్తూనే ఉంటుంది. Also Read : 50వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు–రిలయెన్స్ #farmers #telugu-news #ktr #lagacharla మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి