India-Nepal: సరిహద్దు వాణిజ్యంపై నేపాల్ అభ్యంతరాన్ని తోసిపుచ్చిన భారత్

నేపాల్ సరిహద్దు లిపులేఖ్ మీదుగా వాణిజ్యం తిరిగి మొదలు పెట్టాలని భారత్, చైనాలు నిర్ణయించుకున్నాయి. దీనిపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. లిపులేఖ్ తమ భూభాగం అంటోంది. అయితే దీనిని భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది.

New Update
nepal

India-Nepal

భారత్, చైనా లు తమ మధ్య ఉన్న దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో నేపాల్ మీదుగా వాణిజ్య సరిహద్దులను పునరుద్ధరించుకోవాలని నిర్ణయించారు. అయితే దీనిపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని భారత విదేశాంగ శాఖ కొట్టిపడేసింది. నేపాల్ వాదనలు సరిగ్గా లేవని చెప్పింది.

వాణిజ్యం తిరిగి ప్రారంభం..

భారత్, చైనా రెండిటితోనూ నేపాల్ సరిహద్లును పంచుకుంటోంది. ఒకరకంగా ఈ దేశం భారత్, చైనా రెండు దేశాలకు మధ్యలో ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండు దేశాలు నేపాల్ మీదుగా తిరిగి వాణిజ్యాన్ని మొదలుపెట్టాలని చర్చించుకున్నాయి. గత రెండు రోజులుగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత్ పర్యటనల ఉన్నారు. ఇందులో భాగంగా రెండు దేశాల విదేశాంగ మంత్రులూ అనేక దౌత్యపరమైన విషయాలపై చర్చించుకున్నారు. ఇందులో నేపాల్ సరిహద్దు ఒకటి. లిపులేఖ్ మీదుగా వాణిజ్య సరిహద్దులను తిరిగి పునరుద్ధరించాలని భారత్, చైనా నిర్ణయించుకున్నాయి. 

అభ్యంతరం వ్యక్తం చేసిన నేపాల్..

అయితే దీన్ని నేపాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మహాకాళి నదికి తూర్పున ఉన్న లింపియాధుర, లిపులేఖ్‌, కాలాపాణిలు తమ దేశంలో భాగమని పాల్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లోక్‌ బహదూర్‌ ఛెత్రి అన్నారు. మ్యాప్ చూస్తే అర్థమవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఆల్రెడీ చైనాకు చెప్పామని కూడా తెలిపారు. తమ దేశం మీదుగా వాణిజ్యం చేయాలనుకుంటే తమ అనుమతి కూడా ఉండాలని ఛెత్రి అన్నారు. భారత్, నేపాల్మధ్య ఉన్న సరిహద్దు వివాదాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

చారిత్రక ఆధారాలు లేవు..

అయితే భారత్ సేపాల్ అభ్యంతరాన్ని తోసి పుచ్చింది. ఆ దేశం చూపిస్తున్నా కారణాలు సరైనవి కావని భారత విదేశాంగ శాఖ అంటోంది. లిపులేఖ్ మీదుగా భారత్, చైనా మధ్య వ్యాపార్ 1953 నుంచే ఉందని...మధ్యలో కొన్ని కారణాల వలన నిలిచిపోయిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు దాన్నే తిరిగి ప్రార:బించాలని అనుకుంటున్నామని స్పష్టం చేసింది.  లిపులేఖ్...నేపాల్ ఉందనే వాదనకు ఎటువంటి చారిత్రక ఆధారం లేదని అంది. వారికి వారు కృత్రిమంగా ఏర్పాటు చేసుకుంటే దానికి అంగీకరించేది లేదని చెప్పింది. ఈ విషయంపై నేపాల్ తో చర్చిస్తామని తెలిపింది. అయితే లిపులేఖ్, కాలాపానీ, లింపుయాదురా ప్రాంతాలు తమ భూభాగాలని 2020లో నేపాల్ కొత్త మ్యాప్ ను విడుదల చేసింది. నాటి కేపీ శర్మ వోలీ ప్రభుత్వం ఈ తీర్మానంపై ఆమోద ముద్ర కూడా వేసింది. అప్పుడే భారత్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది..కానీ నేపాల్ దాన్ని పట్టించుకోలేదు. 

Also Read: Strong Warning: భారత్ ను వదులుకుంటే..చైనాకు తలవొంచాల్సిందే - నిక్కీ హేలీ

Advertisment
తాజా కథనాలు