/rtv/media/media_files/2025/11/16/massive-fire-engulfs-banquet-hall-in-gorakhpur-2025-11-16-15-26-22.jpg)
Massive Fire Engulfs Banquet Hall In Gorakhpur
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ రెస్టారెంట్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ సాయంతో మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంపై గోరఖ్‌పూర్ సీఎఫ్‌వో సంతోష్ కుమార్ మాట్లాడారు. ఆదివారం ఉదయం ఫౌజ్ మ్యూజియం ఎదురుగా అదర్వవేద రెస్టారెంట్ అండ్ బాంక్వెట్ హాల్‌లో అగ్నిప్రమాదం జరిగిందని తెలిపారు.
Also Read: ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్.. అక్కడే దొరికిన మూడు బుల్లెట్లు
సమాచారం మేరకు హుటాహుటీనా నాలుగు ఫైరింజన్‌లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశాయని పేర్కొన్నారు. ఆ తర్వాత భవనాన్ని పరిశీలించగా.. మొదటి ఫ్లోర్‌లో వాష్‌రూమ్‌లో వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు తెలిపారు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించామని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు.
#WATCH | Gorakhpur, UP: Fire breaks out at a restaurant and banquet hall in Gorakhpur early this morning. Fire tenders reached the spot and doused the flames. pic.twitter.com/zkfckNQXxU
— ANI (@ANI) November 16, 2025
Follow Us