దండకారణ్యంలో మరోసారి కాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇద్దరు జనాన్లకు కూడా గాయాలయ్యాయి. By B Aravind 16 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి గత కొంతకాలంగా భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇద్దరు జనాన్లకు కూడా గాయాలయ్యాయి. కాకూర్, టేకుమేట అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌తో ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Also Read: రేవంత్ ఛాలెంజ్ స్వీకరించిన కిషన్ రెడ్డి..3 నెలలు అక్కడే నిద్ర! ఇదిలాఉండగా బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని రేఖపల్లి అడవుల్లో కూడా గత శుక్రవారం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. బాసగూడ, ఊసూరు, పామేడు పోలీస్ స్టేషన్ల పరిధిలోని అడవుల్లో పీఎల్జీఏ బెటాలియన్ మావోయిస్టులు భారీ సంఖ్యలో సమావేశం అయ్యారనే పక్కా సమాచారం తెలిసింది. దీంతో సీఆర్పీఎఫ్ కోబ్రా 210 బెటాలియన్, డీఆర్జీ బలగాలు రంగంలోకి దిగారు. దీంతో భద్రత బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరగడంతో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. Also Read: పెళ్లి పేరుతో మైనర్ బాలికను తల్లిదండ్రులు.. ఏం చేశారంటే? మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతలపై ప్రత్యేక దృష్టిసారించిన కేంద్రం తన ఆపరేషన్లను మరింత ముమ్మరం చేసింది. ఈ ఏడాదిలో అక్టోబర్ 5 నాటికి 202 మంది నక్సల్స్‌ను మట్టుబెట్టామని కేంద్ర హోంశాఖ ప్రకటన చేసింది. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 14,400 కిలోమీటర్ల పొడవైన రోడ్లతో పాటు 6 వేల మొబైల్ టవర్లు నిర్మించినట్లు వెల్లడించింది. ఇక 2026 మార్చి 31 మావోయిస్టులకు చివరి రోజు అని కేంద్ర హోంమంత్రి అమిత్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమయానికి వామపక్ష తీవ్రవాద రహిత భారత్‌ను చూస్తారని పేర్కొన్నారు. Also Read: మోదీకి బిగ్ షాక్.. ఎన్నికలకు ముందు అధికార మహాయుతి కుటమిలో విభేదాలు #telangana #national-news #maoist మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి