Marriage: ఆలస్యమైన పెళ్లి భోజనాలు.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఇరు వర్గాలు

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి భోజనం ఏర్పాటు ఆలస్యమైందని వరుడి తరఫున బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య చెలరేగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది.

New Update
Massive Brawl Erupts At Wedding Over Food Service Delay In Uttar Pradesh

Massive Brawl Erupts At Wedding Over Food Service Delay In Uttar Pradesh


ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి భోజనం ఏర్పాటు ఆలస్యమైందని వరుడి తరఫున బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య చెలరేగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఒకరినొకరు కొట్టుకోవడం, చైర్లు విసురుకోవడం లాంటివి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇంతకీ అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read: అప్పటిలోగా ఆయుధాల్ని అప్పగించండి.. లేకపోతే.. మణిపుర్‌ గవర్నర్‌ హెచ్చరిక

జిల్లాలోని గోవర్థన్‌పూర్‌ గ్రామంలో సబీర్ అనే వ్యక్తి తన కూతురు పెళ్లి జరిపిస్తు్న్నాడు. వేడుకలో భాగంగా ఆయన విందు ఏర్పాట్లలో బిజీ అయిపోయాడు. అయితే వరుడి తరుఫు బంధువుల్లో కొందరు యువకులు తమకు వెంటనే భోజనం వడ్డించాలంటూ డిమాండ్ చేశారు. వాళ్లకి నచ్చజెప్పేందుకు సబీర్‌ యత్నించాడు. కానీ అది జరగలేదు. దీంతో వరుడు, వధువు తరఫు బంధువుల మధ్య మొదలైన వాగ్వదం చివరికి ఘర్షణగా మారింది. 

Also Read: యోగి ప్రభుత్వం న్యూ స్కీమ్.. ఉచితంగా విద్యార్థినులకు స్కూటీలు

ఈ గొడవతో పెళ్లి వేడుక అంతా గందరగోళంగా మారిపోయింది. ఒకరినొకరు కొట్టుకోవడం, కూర్చీలు విసురుకోవడం లాంటివి చేసుకున్నారు. ఈ గొడవలో తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. వాళ్లని ఆస్పత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గొడవపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Also Read: తల్లిని ఇంట్లో నిర్బంధించి భార్య , పిల్లలతో కుంభమేళాకు వెళ్లిన కొడుకు.. చివరికీ

Also Read: రేఖా గుప్తాకు ఇతర సీఎంలకు ఉన్న ఆ 5 పవర్స్ ఉండవు.. అవేంటో తెలుసా?

Advertisment
తాజా కథనాలు