/rtv/media/media_files/2025/04/28/vJVlR2c6qaw2mlmWwIkz.jpg)
Operation Karregutta
Maoist party : చత్తీస్ గఢ్... బీజాపూర్ జిల్లా తెలంగాణ సరిహద్దు ప్రాంతం ములుగు జిల్లా కర్రె గుట్టపై జరుగుతున్న బలగాల ఆపరేషన్ గురించి మావోయిస్టులు మరొక లేఖ విడుదల చేశారు...ఈసారి మావోయిస్టులు కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేక విడుదల చేసింది.
ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!
కర్రెగుట్ట ఆపరేషన్ నేపథ్యంలో మావోయిస్టులు రెండోసారి శాంతి చర్చల కోసం లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధమని చెప్పి శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. కర్రెగుట్ట ఆపరేషన్ లో భాగంగా పూజారి కాంకేర్ వద్ద ముగ్గురు మావోయిస్టు మృతి చెందినట్లు అంగీకరించారు. ప్రభుత్వం నుండి ఎటువంటి షరతులు లేకుండా ఝార్ఖండ్ ఒరిస్సా తో సహా చత్తీస్ గఢ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో యుద్ధాన్ని నిర్ణీత సమయంలో ముగించి మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చూడండి: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!
లేఖ సారాంశమిది…
గత 2024 జనవరి నుంచి కేంద్ర, రాష్ర్ట పోలీసు, పారామిలిటరీ, కమాండో బలగాలు ఆఫరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు విప్లవోద్యమ ప్రాంతాల్లో వందలాది మంది మావోయిస్టులను, అమాయక ఆదివాసులను హత్య చేయడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా అనేక ప్రజాస్వామిక, విప్లవ ప్రజాసంఘాలు, పార్టీలు, సామాజిక సంస్థలు, కార్యకర్తలు, ప్రగతిశీల, ప్రజాస్వామిక, విప్లవ మేధావులు వందలాది మంది ఉద్యమిస్తున్నారు. ఆపరేషన్ కగార్ ను తక్షణం నిలిపివేసి, కాల్పులు విరమించి ప్రభుత్వం, మావోయిస్టులు కలిసి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మా పార్టీ కేంద్రకమిటీ ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమని నేను మార్చి 28వ తేదీన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశాను. మా పీఎల్ జీఏ బలగాల సాయుధ చర్యలను నిలిపివేయాలని మా కామ్రెడ్స్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?
శాంతి చర్చల కోసం మా పార్టీ వైపు నుంచి నేను ఇచ్చిన ప్రకటన, దండకారణ్యంలోని ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో వైపు నుంచి కామ్రెడ్ రూపేష్ ఇచ్చిన రెండు ప్రకటనలతో కలిసి ఇప్పటికే మూడు పత్రిక ప్రకటనలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు ఝార్ఖండ్ రాష్ట్రంలో బొకారో హత్యాకాండలో మా కేంద్రకమిటీ సభ్యుడు కామ్రెడ్ వివేక్ తదితర కామ్రెడ్స్ ను హత్య చేశాయి. మావొయిస్టులు లొంగిపోకపోతే ఇతే గతి పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ , తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల ప్రాంతాన్ని దిగ్భందించి పదివేలమంది పోలీసులు 5 రోజుల నుంచి పెద్ద ఆఫరేషన్ సాగిస్తూ ఆరుగురిని హత్య చేయడమే కాకుండా మా పార్టీ నాయకత్వాన్ని హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మేము ఒకవైపు చర్చలకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ విధంగా విప్లవకారులపై హత్యాకాండలు సాగిస్తే మా ప్రయత్నానికి అర్థం లేకుండా పోతుంది. శాంతి చర్చలకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం కోసం హత్యాకాండలను ఆపాల్సిందిగా దేశవ్యాప్తంగా ఛత్తీసఘడ్, ఝార్ఖండ్ , ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్ రాష్ర్టలలో సమయావధితో కూడిన కాల్పుల విరమణను ప్రకటించాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతి చర్చలకు కోసం మాపార్టీ సాగిస్తున్న మా న్యాయమైన డిమాండ్ కు ప్రజాస్వామిక వాదులు మద్దతు ప్రకటించాల్సిందిగా కోరుతోంది.
అభయ్ , అధికార ప్రతినిధి , కేంద్ర కమిటీ, భాకపా (మావోయిస్టు)
ఇది కూడా చూడండి: Pakistan-India-China: భారత్-పాక్ పరిణామాలను చాలా క్షుణంగా పరిశీలిస్తున్నాం!