/rtv/media/media_files/2025/01/31/qu8Hx3l8nnVpGsXOup8X.jpg)
Mitchell Marsh Photograph: (Mitchell Marsh)
వచ్చే నెలలో పాకిస్తాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వెన్నునొప్పి కారణంగా ట్రోఫీ నుండి వైదొలిగాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. మార్ష్ లేకపోవడం వల్ల ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్‌లో అలెక్స్ కారీతో భర్తీ చేసే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా తన జట్టును ప్రకటించింది.
జట్టు ఇదే
పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషాగ్నే, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా
🚨 Mitch Marsh has been ruled out of the ICC Champions Trophy with a back issue
— cricket.com.au (@cricketcomau) January 31, 2025
More: https://t.co/tRDaUSHYrX pic.twitter.com/ozuXcLYctT
ఆస్ట్రేలియా గ్రూప్ B మ్యాచ్‌లు
ఫిబ్రవరి 22: ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్, లాహోర్
ఫిబ్రవరి 25: ఆస్ట్రేలియా v సౌతాఫ్రికా, రావల్పిండి
ఫిబ్రవరి 28: ఆఫ్ఘనిస్తాన్ v ఆస్ట్రేలియా, లాహోర్
మార్చి 4: సెమీ-ఫైనల్ 1, దుబాయ్
మార్చి 5: సెమీ-ఫైనల్ 2, లాహోర్
మార్చి 9: ఫైనల్, లాహోర్ లేదా దుబాయ్
మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే పలుదేశాలు తమ జట్టులను ప్రకటించాయి. కానీ భారత్ ఇంకా ప్రకటించలేదు. దాదాపుగా 4 నుంచి5 వారాల ముందే జట్టులను ప్రకటించాలి. బుమ్రా లాంటి ఆటగాళ్లు ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతుండుతున్నారు. అతడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం అనుమానంగానే అతడి విషయంలో క్లారిటీ రావడానికి మరింత టైమ్ పట్టే అవకాశం ఉంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించేందుకు మరింత టైమ్ కావాలని ఐసీసీని బీసీసీఐ కోరవచ్చని తెలుస్తోంది. ఒకసారి జట్టును ప్రకటించాక మార్పులు చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో బీసీసీఐ ఆచితూచి వ్యవహరిపస్తుంది. మరి భారత సెలక్టర్లు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.