/rtv/media/media_files/2025/01/15/qp7zPXXRYch8KvcPMmPa.jpg)
Deadbody
కేరళలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చనిపోయాడుకున్న ఓ వ్యక్తిని మార్చూరీకి తీసుకెళ్లగా అతడి శరీరంలో కదలికలు వచ్చాయి. దీంతో అక్కడున్న వాళ్లందరూ షాకైపోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కన్నూర్ జిల్లాకు చెందిన పవిత్రన్ (67) అనే వ్యక్తి ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో ఆస్పత్రిపాలయ్యారు. మంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే వైద్య ఖర్చులు భరించలేక కుటుంబ సభ్యులు తమ ఇంటికి తీసుకెళ్లాలని అనుకున్నారు.
Also Read: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
కానీ వెంటిలేటర్ లేకపోతే ఆయన జీవించడం కష్టమని.. నిమిషాల్లోనే చనిపోతారని వైద్యులు తన ఫ్యామిలీకి చెప్పారు. అయినాకూడా వాళ్లు పవిత్రన్‌ను అంబులెన్స్‌లో తీసుకొని బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో అతడు అచేతనంగా ఉండటం, కళ్లు తెరవకపోవడం, రక్తపోటు కూడా పడిపోయింది. దీంతో వైద్యులు చెప్పినట్లుగానే ఆయన చనిపోయాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఇంటికి చేరేసరికి చీకటి పడింది. దీంతో మృతదేహాన్ని భద్రపరిచేందుకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని మార్చురీకి తీసుకెళ్లారు. అంతేకాదు ఇంటి దగ్గర అంత్యక్రియలకు కూడా ఏర్పా్ట్లు మొదలుపెట్టారు.
Also Read: ప్రభుత్వ సొమ్ము ప్రజల కోసమా ? సైకిల్ ట్రాక్‌ల కోసమా ?.. సుప్రీంకోర్టు ఆగ్రహం
అయితే మార్చురీ వద్ద పవిత్రన్ చేతివేళ్లు కదులుతున్నట్లు ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. రక్తపోటు తనిఖీ చేయగా నార్మల్ వచ్చింది. దీంతో వెంటనే ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. అయితే మరుసటి రోజు ఉదయం ఆయన మృతిపై సన్నిహితుల సంతాప ప్రకటనలు వార్తాపత్రికల్లో రావడం చూసి అక్కడున్న వాళ్లు ఆశ్చర్యపోయారు.
Also Read: జనవరి 16న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌కు అంతరాయం.. !
Also Read: పెద్ద చదువులు చదివి సన్యాసం.. కుంభమేళలో IIT బాబా వైరల్