Mamata Banerjee: ఐపాక్ ఆఫీస్‌లో ED సోదాలు.. అధికారుల నుంచి ఫైల్స్ లాక్కున్న CM మమతా బెనర్జీ

వెస్ట్ బెంగాల్‌లోని కోల్‌కతాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గురువారం ఉదయం పొలిటికల్ కన్సల్టెన్సీ కంపెనీ ఐపాక్‌పై, దాని ఓనర్ ప్రతీక్ జైన్ ఇంటిపై ఈడీ రైడ్స్ చేసింది. ఈ సోదాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి.

New Update
I PAC

వెస్ట్ బెంగాల్‌లోని కోల్‌కతాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గురువారం ఉదయం పొలిటికల్ కన్సల్టెన్సీ కంపెనీ ఐపాక్‌(Kolkata I-PAC office) పై, దాని ఓనర్ ప్రతీక్ జైన్ ఇంటిపై ఈడీ రైడ్స్(ed-raides) చేసింది. ఈ సోదాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్న టీఎంసీ(tmc) కి ఐ-పాక్ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తు్న్న విషయం తెలిసిందే. ఆ కంపెనీ ఆఫీస్, దాని అధినేత ప్రతీక్ జైన్ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాలు జరుగుతుండగానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(cm-mamatha-benarjee) స్వయంగా రంగంలోకి దిగడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.

లౌడన్ స్ట్రీట్‌లోని ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ సోదాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడికి చేరుకున్నారు. ఆమెతో పాటు కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ కూడా ఉన్నారు. సుమారు 25 నిమిషాల పాటు లోపల ఉన్న మమత, బయటకు వస్తూ తన చేతిలో ఒక 'గ్రీన్ ఫైల్', ఒక హార్డ్ డిస్క్ పట్టుకుని కనిపించారు. ఒక దర్యాప్తు సంస్థ సోదాలు చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి పత్రాలు తీసుకురావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

Also Read :  మైన‌ర్ అథ్లెట్‌పై లైంగిక వేధింపులు.. జాతీయ షూటింగ్ కోచ్‌పై కేసు ఫైల్

ఆ గ్రీన్ ఫైల్స్‌లో ఏముంది?

బయటకు వచ్చిన తర్వాత మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. "ఈడీ అధికారులు మా పార్టీ ఇంటర్నల్ డాక్యుమెంట్స్, రాబోయే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను, పార్టీ వ్యూహాలను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ఫైల్‌లో మా పార్టీ రహస్యాలు ఉన్నాయి. అందుకే నేను వాటిని ఈడీ నుంచి తిరిగి తెచ్చుకున్నాను" అని ఆమె ప్రకటించారు. ఐ-పాక్ కేవలం ఒక కన్సల్టెన్సీ సంస్థే కాకుండా తన పార్టీ ఐటీ సెల్‌గా పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మమత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "దేశాన్ని రక్షించలేని హోంమంత్రి, రాజకీయ కక్షతో మా పార్టీ డాక్యుమెంట్లను సేకరించడానికి ఈడీని పంపిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. రేపు నేను బీజేపీ కార్యాలయంపై దాడి చేస్తే పరిస్థితి ఏంటి?" అని ఆమె ప్రశ్నించారు. ఈ సోదాలు కేవలం బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీని ఇబ్బంది పెట్టడానికేనని ఆమె ఆరోపించారు.

Also Read :  2వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వీధి కుక్క.. శాంతి యాత్రలో అలోక స్పెషాలిటీ!

బీజేపీ విమర్శలు..

మరోవైపు బీజేపీ ఈ ఉదంతాన్ని తీవ్రంగా ఖండించింది. బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి స్పందిస్తూ.. "ఒక రాజ్యాంగబద్ధమైన దర్యాప్తు సంస్థ పనిని అడ్డుకోవడం ముఖ్యమంత్రికి తగదు. ఆ గ్రీన్ ఫైల్స్‌లో ఏదో పెద్ద అవినీతి రహస్యం దాగి ఉంది కాబట్టే ఆమె అంత హడావిడిగా వెళ్లి వాటిని తెచ్చుకున్నారు" అని ఆరోపించారు. మొత్తానికి ఈ రైడ్స్ బెంగాల్, కేంద్ర ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేసింది. ఈ సోదాలు బొగ్గు అక్రమ రవాణా లేదా ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా జరిగినట్లు ఈడీ వర్గాల సమాచారం.

Advertisment
తాజా కథనాలు