Maoists: ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలో భారీగా పేలుడు సామాగ్రి స్వాధీనం

ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలో మెటగూడెం, డ్యూలర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాల తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 203 కోబ్రా బెటాలియన్, సీఆర్పీఎఫ్ 131 బెటాలియన్ ఆధ్వర్యంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ జరిగింది. 

New Update
Chattisghar

MAJOR MAOIST ARSENAL UNCOVERED

ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో మెటగూడెం, డ్యూలర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధాల కర్మాగారాన్ని కనుగొన్నారు పోలీసులు. 203 కోబ్రా బెటాలియన్, సీఆర్పీఎఫ్ 131 బెటాలియన్ ఏ, డీ కంపెనీలు చేపట్టిన ఆపరేషన్ లో ఇక్కడ భారీగా పేలుడు పదార్ధాలు, ఆయుధాల తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. మెటగూడెం గ్రామం దగ్గరలో 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక గుహ ఉంది. అందులో భద్రతా బలగాలు ఆయుధశాల ఉన్నట్టు గమనించారు. దానిని తనిఖీ చేయగా అందులో.. ప్యాక్ చేసిన 21 ఐఈడీలు, బహుళ బారెల్ గ్రెనేడ్ లాంచర్ బాంబులు, ఒక జనరేటర్ సెట్, లాత్ మెషిన్ ఉపకరణాలు, భారీ పరిమాణంలో పేలుడు తయారీ పదార్థాలు, తుపాకీ తయారీ పరికరాలు, వైద్య సామగ్రి కనిపించాయి. దాంతో వెంటనే వాటినన్నటినీ స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఉపయోగించుకునే మావోయిస్టులు దాడులు చేస్తున్నట్టు గుర్తించారు. అయితే ఇప్పుడు ఆయుధాలను పట్టుకోవడం వలన మావోయిస్టులు పూర్తిగా దాడులు మానేస్తారనడానికి వీల్లేదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. 

Also Read: భారత్‌ సంచలనం.. 99.1 కోట్లకు చేరిన ఓటర్ల సంఖ్య

రీసెంట్ గా ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్లు జరిగాయి. తాజాగా రెండు రోజుల క్రితం జరిగిన దానిలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో సెంట్రల్‌ కమిటీ మెంబర్ మనోజ్ ఉన్నట్లుగా తెలుస్తోంది.  మృతుల్లో మరికొందరు కీలక మావోయిస్టులున్నారని వార్తలు వస్తున్నాయి.  ఒడిశాలోని నువాపాడా జిల్లాకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని కులారిఘాట్ రిజర్వ్ ఫారెస్ట్‌లో భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారని ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా జనవరి 19వ తేదీ రాత్రి ఆపరేషన్ ప్రారంభించింది.  భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగగా.. ఈ కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.   

Also Read: అలా చేస్తే మీ పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలే ఉంటారు : ఏక్‌నాథ్ షిండే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు