Indian Voters: భారత్‌ సంచలనం.. 99.1 కోట్లకు చేరిన ఓటర్ల సంఖ్య

భారత్‌లో ఓటర్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 99.1 కోట్లకు చేరుకుంది. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయానికి 96.88 కోట్ల ఓటర్లు ఉండేవారు. తాజాగా ఆ సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది.త్వరలోనే ఇది 100 కోట్లకు చేరుకోనుందని సమాచారం.

New Update
Indian Voters

Indian Voters

భారత్‌లో ఓటర్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 99.1 కోట్లకు చేరుకుంది. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయానికి 96.88 కోట్ల ఓటర్లు ఉండేవారు. తాజాగా ఆ సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది. జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బుధవారం ఎలక్షన్ కమిషన్ ఈ వివరాలు వెల్లడించింది. త్వరలోనే ఇది 100 కోట్లకు చేరుకోనుందని పేర్కొంది. దీంతో బిలయన్ ఓటర్లున్న దేశంగా ఇండియా సరికొత్త రికార్డు సృష్టించనుంది.

Also Read: భార్యను కుక్కర్‌లో ఉడికించిన ఘటన.. గురుమూర్తి సెల్‌ఫోన్‌లో సంచలన విషయం

ఇక వివరాల్లోకి వెళ్తే దేశంలో 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న యువత 21.7 కోట్ల మంది ఉన్నారు.స్త్రీ, పురుష నిష్పత్తి 2024తో పోలిస్తే 2025లో తగ్గిపోయింది. 2024లో ప్రతీ వెయ్యిమంది పురుషు ఓటర్లకు 948 మంది మహిళా ఓటర్లు ఉండేవారు. అయితే 2025 నాటికి ప్రతీ వెయ్యిమంది పురుష ఓటర్లకు 954 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. దీంతో దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య ఏకంగా 48 కోట్లకు చేరుకుంది. 

Also Read: హైదరాబాద్‌ కిడ్నీ రాకేట్‌ వ్యవహారం.. వెలుగులోకి సంచలన విషయాలు

2024 లోక్‌సభ ఎన్నికల సమయానికి మొత్తం 47.15 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 49.72 కోట్ల మంది పురుష ఓటర్లు ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్‌ ఓటర్ల సంఖ్య 48,044గా ఉంది. మరో ఏడాదిలోనే దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 100 కోట్లకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రపంచంలోనే 100 కోట్ల ఓటర్లు ఉన్న దేశంగా భారత్‌.. ఇప్పటివరకు ఏ దేశం చేయలేని రికార్డును సొంతం చేసుకోనుంది.   

Also Read: ఐదేళ్లలో నిరుద్యోగం లేకుండా చేస్తా.. కేజ్రీవాల్ సంచలన హామీ

Also Read: ట్రంప్‌ నిర్ణయంతో అమెరికాలో హాస్పిటళ్లకు క్యూ కడుతున్న ఇండియన్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు