/rtv/media/media_files/2025/04/27/pWha5H0dVO9MbACkIJES.jpg)
Fire Accident
Fire Accident : ముంబై బల్లార్డ్ ఎస్టేట్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయ భవనంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 2:31 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ మంటలు తక్కువ సమయంలోనే మరింత విస్తరించాయి. దీంతో అగ్నిమాపక దళం పెద్ద ఎత్తున మంటలను అదుపు చేసింది.
Also read : Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని ED కార్యాలయ భవనంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించిందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు సంభవించలేదని తెలిపారు. కురింభోయ్ రోడ్డులోని గ్రాండ్ హోటల్ సమీపంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయం ఉన్న బహుళ అంతస్తుల కైజర్-ఐ-హింద్ భవనంలో ఆదివారం తెల్లవారుజామున 2:31 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక దళానికి సమాచారం అందిందని అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్!
అగ్నిమాపక దళం బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలను ప్రారంభించాయి. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో, మంటలను అదుపు చేయగలిగామని , ఇది అతిపెద్ద అగ్నిప్రమాదంగా పరిగణించబడుతుందని అగ్నిమాపక దళం ధృవీకరించింది. అగ్నిమాపక సిబ్బంది త్వరిత గతిన స్పందించడంతో ఐదు అంతస్తుల భవనంలోని నాల్గవ అంతస్తుకే మంటలు పరిమితమయ్యాయని అధికారులు తెలిపారు.
Also read : India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!
ప్రమాదాన్ని నివారించేందుకు గాను ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు, ఆరు జంబో ట్యాంకర్లు, ఒక వైమానిక నీటి టవర్ టెండర్, ఒక బ్రీతింగ్ ఉపకరణ వ్యాన్, ఒక రెస్క్యూ వ్యాన్, ఒక క్విక్ రెస్పాన్స్ వెహికల్, 108 సర్వీస్ నుండి అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారి తెలిపారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా నిర్ధారించబడలేదు.
Also Read : Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!
Also read : Bike Accident : తండ్రికి బైక్‌ను గిప్ట్గా ఇచ్చేందుకు వెళ్తూ అనంతలోకాలకు!