దేశంలోనే ఖరీదైన మామిడి.. ఒక్కో పండు ధర రూ.10 వేలు

అత్యంత ఖరీదైన మియాజాకీ మామిడి పండును మహారాష్ట్రలోకి చెందిన ఓ మహిళ సాగు చేసింది. దీన్ని వ్యవసాయ క్షేత్రంలో ప్రదర్శించగా ఒక్కోక్కటి రూ.10 వేల ధర పలికింది. జపాన్ నుంచి మొక్కలు తీసుకొచ్చి ఈ మామిడి సాగును రెండేళ్ల క్రితం చేపట్టగా ఇప్పుడు కాపుకొచ్చింది.

New Update
Mango cost

Mango cost Photograph: (Mango cost)

వేసవి వస్తుందంటే చాలు.. మామిడి పండ్లు గుర్తొస్తాయి. సాధారణంగా మామిడి పండ్లు కిలో వంద లేదా రెండు వందల వరకు ఉంటుంది. కానీ మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ పండించిన మామిడి పండు ధర మాత్రం వేలలో ఉంది. దేశంలో అత్యధిక ఖరీదైన మామిడి పండుగా ధర పలికింది. వెయ్యి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా రూ.10 వేలు పలికింది. కేవలం ఒక్క మామిడి పండు ధర మాత్రమే రూ.10 వేలు. 

ఇది కూడా చూడండి:SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

ఇది కూడా చూడండి:Betting App Case: ఎవ్వరినీ వదలకండి.. అందరిని జైల్లో వేయండి- పోలీసులకు మైనంపల్లి ఫిర్యాదు!

జపాన్ నుంచి మొక్కలు తీసుకొచ్చి..

మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన ఓ మహిళ రైతు అత్యంత ఖరీదైన మియాజాకీ మామిడి పండును పండించారు. ఒక్కో మామిడి పండు ధరను రూ.10 వేలకు విక్రయించారు. తన కుమారుడు యూట్యూబ్‌లో ఈ పండును చూసి తల్లితో సాగు చేయించాడు. ఈ క్రమంలో రూ.6500 లకు ఒక్కో మొక్కను జపాన్ నుంచి తీసుకొచ్చాడు. 

ఇది కూడా చూడండి:నీ మొగుడ్ని వదిలేసి రా.. హైదరాబాద్ మహిళకు ఎన్ఆర్ఐ వేధింపులు

మొత్తం 10 మొక్కలను తీసుకొచ్చి సాగు చేపట్టాడు. రెండేళ్ల క్రితం సాగు చేపట్టగా ఈ ఏడాది కాపుకు వచ్చింది.  ఒక్కో చెట్టుకు 10 నుంచి 12 కాయలు వచ్చాయి. తాజాగా ఈ మామిడి పండ్లను వ్యవసాయ ప్రదర్శనలో ఉంచారు. ఒక్కో మామిడి పండు రూ.10 వేలకు అమ్ముడుపోయింది. 

Advertisment
తాజా కథనాలు