నీ మొగుడ్ని వదిలేసి రా.. హైదరాబాద్ మహిళకు ఎన్ఆర్ఐ వేధింపులు

38 ఏళ్ల వివాహితను బ్లాక్ మెయిల్ చేసి వేధించినందుకు ఎన్ఆర్ఐ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  నిందితుడిని నౌషాద్ అబూబకర్‌గా గుర్తించారు. నిందితుడితో విసిగిపోయిన వివాహిత జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.

New Update
nri conmen

38 ఏళ్ల మహిళను బ్లాక్ మెయిల్ చేసి వేధించినందుకు ఎన్ఆర్ఐ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  నిందితుడిని నౌషాద్ అబూబకర్‌గా గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..  జూబ్లీ హిల్స్‌కు చెందిన 38 ఏళ్ల వివాహిత ఆరు సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్లింది. అక్కడ ఓ పబ్ లో రెండు సంవత్సరాలుగా డాన్సర్ గా పనిచేసింది. ఈ క్రమంలో ఆమెకు 38 ఏళ్ల నౌషాద్ అబూబకర్‌తో పరిచయం ఏర్పడింది. 

Also read :  భయ్యా సన్నీ యాదవ్‌కు బిగ్ షాక్.. లుక్ ఔట్ నోటీసులు జారీ

నౌషాద్ అబూబకర్‌ వేధింపులు

దీంతో ఇద్దరు స్నేహితులుగా మారారు.  ఆ తరువాత ఆ వివాహిత హైదరాబాద్ కు తిరిగి వచ్చేసింది. అయితే కాస్త చనువుతో ఆమెతో తనతో దిగిన ఫోటోలను బెదిరిస్తూ ఫోన్లు చేశాడు నౌషాద్ అబూబకర్‌. అలా చేయవద్దని వివాహిత వేడుకుంది. అయినప్పటికీ నౌషాద్ అబూబకర్‌ వేధింపులు ఆగలేదు. దీంతో ఆ వివాహిత మరోమారు దుబాయ్ కు వెళ్లి అతన్ని కలిసి వేడుకుంది. దీనికి నౌషద్ ఫోటోలు, వీడియోలను తొలగిస్తానని ఆమెకు చెప్పాడు. 

Also read :  Twitter Old Logo: వేలంలో ట్విట్టర్‌ పాత లోగో.. భారీ ధర పలికిన ఐకాన్

నీ భర్త, పిల్లల్ని వదిలేసి.. నన్ను పెళ్లి చేసుకో 

దీంతో ఆమె తిరిగి హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. కొద్దీరోజులు బాగానే ఉన్న మళ్లీ వేధింపులు మొదలుపెట్టాడు. హైదరాబాద్ కు వచ్చిన  నౌషాద్ అబూబకర్‌ వివాహితకు ఫోన్ చేసి నీ భర్త, పిల్లలను విడిచిపెట్టి తనను వివాహం చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. నిరాకరిస్తే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని కూడా బెదిరించాడు. దీంతో విసిగిపోయిన వివాహిత మార్చి 20 గురువారం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎన్ఆర్ఐని అదుపులోకి తీసుకున్నారు.  

Also read :  ఇస్తే తీసుకుంటా...అధ్యక్ష పదవిపై బండి సంజయ్ హాట్ కామెంట్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు