Betting App Case: ఎవ్వరినీ వదలకండి.. అందరిని జైల్లో వేయండి- పోలీసులకు మైనంపల్లి ఫిర్యాదు!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారికి బిగ్ షాక్ తగిలింది. మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు నేరెడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వాళ్లు ఎంతటి వారైనా వదలొద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

New Update

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుసగా ఈ వ్యవహారంలో ఉన్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పంజాగుట్ట పీఎస్‌లో 11 మందిపై కేసు నమోదు చేశారు. అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో మరో 25 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో ఇప్పటివరకు విష్ణుప్రియ, రీతు చౌదరి మాత్రమే పోలీసుల విచారణకు వెళ్లారు. 

Also Read: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?

మైనంపల్లి ఫిర్యాదు

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్‌ ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ వ్యవహారంలో ఉండి ఇప్పటి వరకు కేసులు నమోదు కాని వాళ్లకు బిగ్ షాక్ తగలనుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి.. ఇంకా కేసు కాకుండా ఉన్న వారిపై పోలీసులు కేసులు పెట్టనున్నారు. ఇందులో భాగంగానే మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు నేరెడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?

బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వాళ్లు.. ఎంత పెద్దవారైనా వదలొద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినయ్ కుయ్యా, శివజ్యోతి, డేర్‌స్టార్‌ గోపాల్‌, శ్రీధర్ చాప, విజ్జుగౌడ్‌పై కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ బెట్టింగ్ యాప్స్ కాంట్రవర్సీ ఎంతవరకు వెళ్తుందో.

Also Read: కర్నూలులో దారుణ హత్య. వేట కొడవళ్లతో వెంబడించి.. షాకింగ్ వీడియో!

(betting-app | mainampally-hanmantha-rao | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు