/rtv/media/media_files/2024/11/18/atSumSZYil5AZHlKjvR1.jpg)
Jio Un Limited Data Vocher:
టెలికాం రంగంలో జియో దూసుకుపోతుంది. కొత్త ఆపఱ్లతో వినియోగదారులను అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా అన్ లిమిటెడ్ డేటాతో కొత్త వోచర్‌ను ప్రవేశపెట్టింది. ఏడాది పాటూ ఏకధాటిగా 5జీ డేటాను వినియోగించుకొనేలా రూ.601తో అన్‌లిమిటెడ్ 5జీ అప్‌గ్రేడ్ వోచర్‌ను తీసుకొచ్చింది. 4జీ వినియోగదారులు కూడా ఈ వోచర్ సాయంతో 5జీ సేవలను ఆనందించే అందుకోవచ్చును. రిలయన్స్ జియో కొత్త ప్లాన్ అల్టిమేట్ 5G అప్‌గ్రేడ్ వోచర్ తో మళ్లీ తిరిగి వచ్చింది. రూ. 601 ప్లాన్ ఒక సంవత్సరం పాటు అపరిమిత 5G డేటాను అందిస్తుంది అంటూ తన వెబ్‌సైట్‌లో రిలయెన్స్ దీనికి సంబంధించి ప్రకటన ఇచ్చింది.
Also Read: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..107 విమాన సర్వీసులు ఆలస్యం!
Also Read: డేంజర్ జోన్‌లో దేశ రాజధాని.. తాత్కాలికంగా స్కూళ్లు, కాలేజీలు బంద్
కొత్త వోచర్ ప్రకారం.. రూ.239 కంటే ఎక్కువ రీఛార్జి చేసిన వారందరికీ అన్ లిమిటెడ్ డేటా సదుపాయాన్ని కల్పించింది. ఈ ఏడాది జులైలో ప్లాన్ల ధరల సవరణ సందర్భంగా అపరిమిత 5జీ డేటాకు పరిమితి నిర్దేశించింది. ఎవరైతే రోజుకు 2జీబీ డేటా అందించే ప్లాన్‌ను రీఛార్జి చేసి ఉంటారో వారికి మాత్రమే అపరిమిత 5జీ డేటాను ఆఫర్ చేస్తోంది. అంటే నెలకు రూ.349 ప్లాన్ రీఛార్జి చేసే వారికే ఉచిత 5జీ డేటా అన్నమాట. ఈ వోచర్‌ను స్నేహితులకు కూడా గిఫ్ట్‌లా ఇవ్వొచ్చును. ఇంతకు ముందు తక్కువ డేటా ప్లాన్ తీసుకునే వరికి 5జీ సేవలను అందించేందుకు రీసెంట్‌గా రూ.51, రూ.101, రూ.151తో బూస్టర్ ప్లాన్లను జియో తీసుకొచ్చింది.
Also Read: Movies: నాగ చైతన్య–శోభిత పెళ్ళి శుభలేఖ వచ్చేసింది..చూశారా
Also Read: గ్రూప్-3లో కులంపై వివాదాస్పద ప్రశ్న.. RS ప్రవీణ్ తీవ్ర అభ్యంతరం!