/rtv/media/media_files/2024/11/18/L146F9yj3eT7DUoGNT4J.jpg)
CAG New Chief:
కాగ్ కొత్త ఛీఫ్‌గా ఐఏఎస్ అధికారి కె. సంజయ్ మూర్తిని అపాయింట్ చేశారు. ప్రస్తుతం కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న ఈయనను కాగ్ చీఫ్‌గా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నియమించారు. 1989 ఐఏఎస్ బ్యాచ్ హిమాచల్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సంజయ్‌మూర్తి నియామకాన్ని ధృవపరుస్తూ కేంద్ర ఆర్థికశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం కాగ్ చీఫ్‌గా కొనసాగుతున్న గిరిశ్ చంద్ర ముర్ము పదవీ కాలం నవంబర్ 20తో ముగియనుండటంతో ఆయన స్థానంలో కె.సంజయ్ మూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు.