Maharashtra CM : అల్లర్లకు పాల్పడిన వారికి ఫైన్ వేసి నష్టపరిహారం చెల్లిస్తాం

నాగ్‌పూర్ అల్లర్లకు పాల్పడిన వారి దగ్గరే జరిగిన ఆస్థినష్టానికి పరిహారం వసూలు చేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. డబ్బులు ఇవ్వకుంటే వారి ఆస్తులు జప్తు చేస్తామని ఆయన చెప్పారు. హింసకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

New Update
Maharashtra CM Fadnavis

Maharashtra CM Fadnavis Photograph: (Maharashtra CM Fadnavis)

నాగ్‌పూర్ అల్లర్లు, హింస మహారాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. నాగ్‌పూర్‌లో మార్చి 17న రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ కారణంగా పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లింది. సీసీటీవీ ఫుటేజ్, వీడియో రికార్డులను విశ్లేషించి 104 మంది నిందితులను గుర్తించామని, 92 మందిపై ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. హింసకు కారణమైన వారి నుంచి ఆస్తి నష్టం మొత్తాన్ని వసూలు చేస్తామని ఆయన చెప్పారు. వారు ఫైన్ కట్టకుంటే వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని విక్రయిస్తామన్నారు. హింసాకాండ ఘటనల్లో పోలీసులపై దాడికి దిగిన వారిని కఠినంగా శిక్షిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు.

Also read: AI Grok: తిడితే నవ్వుతున్నాడేంటి.. గ్రోక్‌ బూతు రిప్లేలపై ఎలన్ మస్క్ రియాక్షన్ ఇదే

Also read: Delimitation : JAC సంచలన నిర్ణయం.. ‘డీలిమిటేషన్ ప్రక్రియ మరో 25ఏళ్లు వాయిదా’

నాగపూర్‌‌లో మార్చి 17న చెలరేగిన అల్లర్లలో రాళ్లదాడులు, వాహనాలకు నిప్పుపెట్టిన ఘటనలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మహారాష్ట్రలో 1992 తర్వాత ఇలాంటి ఘటనలేవీ చోటుచేసుకోలేదనీ, పోలీసులపై దాడికి దిగిన వారినెవ్వరినీ విడిచిపెట్టమని చెప్పారు. అల్లర్లు చెలరేగిన గంటల్లోనే పోలీసులు పరిస్థితిని అదుపు చేశారని, అయితే డీసీపీ స్థాయి అధికారితో సహా పలువురు పోలీసులు గాయపడ్డారని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని .. దీని వెనుక ఎవరు ఉన్నా కఠిన చర్యలు తప్పవని ఫడ్నవిస్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు