Delimitation : JAC సంచలన నిర్ణయం.. ‘డీలిమిటేషన్ ప్రక్రియ మరో 25ఏళ్లు వాయిదా’

2026లో జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియపై తమిళనాడు CM స్టాలిన్ అధ్యక్షతన జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ మార్చి 22న చెన్నైలో జరిగింది. ఇందులో మరో 26 ఏళ్లు డీలిమిటేషన్ ప్రక్రియ వాయిదా వేయాలని కేంద్రానికి సూచించాలని నిర్ణయం తీసుకున్నారు.

New Update
delimitation JAC

delimitation JAC Photograph: (delimitation JAC)

2026లో జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జాయింట్ యాక్షన్ కమిటీ మార్చి 22న చెన్నైలో సమావేశం అయ్యింది. డీలిమిటేషన్ ప్రక్రియలో పారదర్శకత ఉండాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలు, పంజాబ్ నుండి ప్రతిపక్ష నాయకులు చెన్నైలో జరిగిన సమావేశమైయ్యారు. ఈ కార్యక్రమానికి కేరళ, తెలంగాణ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, రేవంత్ రెడ్డి, భగవంత్ మాన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ హాజరయ్యారు. తెలంగాణ నుంచి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, బీజేడీ, ఆప్ వంటి రాజకీయ పార్టీల నాయకులు కూడా హాజరయ్యారు.

Also read: KCR: ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ సన్నాసి.. కేసీఆర్ సంచలన కామెంట్స్

ఈ మీటింగ్‌లో అన్నీ రాజకీయ పార్టీల నాయకులు చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు. మరో 26 ఏళ్లు డీలిమిటేషన్ ప్రక్రియ వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరారు. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్యానెల్ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. 1971లో అప్పటి జనాభా ఆధారంగా ఎంపీ స్థానాలు ఏర్పాటు చేశారు. తిరిగి 2026లో పార్లమెంటరీ నియోజకవర్గాలు విస్తరించాలని చట్టం చేశారు. అయితే ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ సీట్లు విభజన జరిగితే దక్షణాది రాష్ట్రాకు అన్యాయం జరుగుతుందని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Also read: BREAKIBG: జైలు నుంచి పోసాని కృష్ణ మురళి విడుదల

కోర్ కమిటీ ప్రధానమంత్రికి వాయిదా నిర్ణయాన్ని సమర్పించనుంది. పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఏవైనా మార్పులు చేయాలంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు మరియు ఇతర సంబంధిత భాగస్వాముల భాగస్వామ్యంతో న్యాయమైన మరియు బహిరంగ ప్రక్రియ ద్వారా జరగాలని తీర్మానం నొక్కి చెప్పింది. ఎమర్జెన్సీ పిరియడ్‌లో జనాభా నియంత్రణ చర్యలను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గే అవకాశం ఉందని సౌత్ ఇండియా రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు