AI Grok: తిడితే నవ్వుతున్నాడేంటి.. గ్రోక్‌ బూతు రిప్లేలపై ఎలన్ మస్క్ రియాక్షన్ ఇదే

ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ ఇండియాలో ఏఐ గ్రోక్ వివాదాలపై స్పందించారు. రాజకీయ వివాదస్పన సమాధానాలు, హిందీలో బూతులతో రిప్లే ఇస్తున్న గ్రోక్‌ను తలుచుకొని ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇండియాలో గ్రోక్ చేస్తున్న దానికి నవ్వుతున్న ఎమోజీ పెట్టి పోస్ట్ చేశారు.

New Update
AI grok musk

AI grok musk Photograph: (AI grok musk)

ఇండియాలో ఎక్స్ AI టూల్ గ్రోక్ సంచలనం స‌ృష్టిస్తోంది. హిందీలో నెటిజన్లను బూతులు తిట్టడంపై యూజర్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సామాజిక, రాజకీయ అంశాల గురించి అడిగినప్పుడు గ్రోక్ ఇస్తున్న రిప్లేలు వివాదాలకు దారితీస్తున్నాయి. గ్రోక్ ఏఐ చాట్ బాట్ ఇండియాలో పెద్ద రాజకీయ దుమారం రేపింది. ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ కంటే నిజాయితీపరుడని సమాధానం ఇచ్చింది. అంతేకాదు.. వెంటనే నేను ఎవరికీ భయపడను అని కూడా చెప్పింది. మోదీ ఇంటర్వ్యూల్లో చాలావరకు స్క్రిప్టెడ్ ఉంటాయని గ్రోక్ గమనించింది. అయితే ఈ సమాధానాలు మోదీ, బీజేపీలను వ్యతిరేకించే వారుతో వెంటనే వైరల్ అయ్యాయి. ఈ గ్రోక్ సమాధానాలతో కేంద్రంలో ప్రతిపక్షం, బీజేపీ మధ్య మాటల యుద్ధం చెలరేగింది.

Also read: BIG BREAKING: తెలంగాణలో 10వేల ఉద్యోగాలు

అంతేకాదు మరో యూజర్ పది బెస్ట్ మూచ్యువల్ ఫండ్స్ గురించి చెప్పమని అడిగాడు.  ఆ ప్రశ్నకు గ్రోక్ కొంత సమయం తీసుకుంది. దీంతో అసహనానికి గురైన యూజర్ గ్రోక్‌ను తిట్టాడు. అది విన్న ఏఐ గ్రోక్ 10 బెస్ట్ మూచ్యువల్ ఫండ్స్ గురించి చెప్పడమే కాక.. తిరిగి హిందీలో బూతులు తిట్టింది. వెంటనే ఈ వీడియో వైరల్ అయ్యింది. ఇలా పొలిటికల్, లాగ్వేంజ్ విషయాలపై గ్రోక్ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తోంది. ఇండియాలో గ్రోక్‌కు పెరుగుతున్న ప్రజాదరణ, హిందీ అసభ్య పదాలను తరచుగా ఉపయోగించడం వల్ల ఏఐ గ్రోక్  విషయం కేంద్రం దృష్టికి వెళ్లింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చాట్‌బాట్ ప్రతిస్పందనలపై వివరణ కోరింది. ఇంతలోనే ఎలన్ మస్క్ ఈ వివాదాలపై స్పందిస్తూ ఓ ఇంటర్‌నేషనల్ మీడియా రాసిన ఆర్టికల్ షేర్ చేస్తూ నవ్వుతున్న ఎమోజీ పోస్ట్ చేశాడు. ఈ కేసులో గ్రోక్ లేదా ఎక్స్‌కు ఎటువంటి నోటీసు పంపబడలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read:అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Advertisment
తాజా కథనాలు