Maharashtra: కేరళ మినీ పాకిస్థాన్.. అందుకే రాహుల్, ప్రియాంక గెలుపు: బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

మహారాష్ట్ర మంత్రి రాణే నోరు పారేసుకున్నారు.కేరళ రాష్ట్రాన్ని పాకిస్తాన్‌ తో పోల్చడమే కాకుండా అక్కడి ప్రజలను ఉగ్రవాదులతో పోల్చారు. అందుకే రాహుల్‌, ప్రియాంక్‌ ఇద్దరు గెలిచారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

New Update
min rane

min rane

Maharashtra: మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితేశ్ రాణే నోరుజారి వివాదంలో చిక్కుకున్నారు. కేరళను మినీ పాకిస్థాన్‌గా అభివర్ణించిన ఆయన.. అక్కడ ప్రజలను, ఓటర్లను ఉగ్రవాదులతో పోల్చారు. అందుకే రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీలు ఎంపీలు గెలిచారని అన్నారు. ఔరంగజేబు సేనాని అప్ఘల్‌ఖాన్‌పై ఛత్రపతి శివాజీ మహరాజ్ చారిత్రక విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని ముంబయిలో సోమవారం ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 

Also Read: Tirumala: తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్తున్నారా..అయితే ఈ కబురు మీకోసమే!

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహారాష్ట్ర మత్స్య శాఖ మంత్రి నితీశ్ రాణే చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం మొదలైంది.నితేశ్ రాణే మాట్లాడుతూ.. ‘‘కేరళ మినీ పాకిస్థాన్‌కు ఏమాత్రం తీసిపోదు. అందువల్లే అక్కడ రాహుల్, ఆయన సోదరి గెలిచారు. ఉగ్రవాదులంతా వారికి ఓటేశారు. నేను నిజమే చెబుతున్నాను. టెర్రరిస్టుల మద్దతు వల్లే వాళ్లిద్దరూ ఎంపీలయ్యారు'’ అని రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో అమేథీ, వయనాడ్ నుంచి పోటీచేసిన రాహుల్ గాంధీ.. వయనాడ్‌లో గెలిచారు. 

Also Read: Ap: ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచిన ప్రభుత్వం..కానీ అక్కడ మాత్రం!

ఈసారి ఎన్నికల్లో వయనాడ్, రాయబరేలిలో పోటీచేసిన రాహుల్ రెండు చోట్ల విజయాన్నిఅందుకున్నారు. అయితే, వయనాడ్ స్థానానికి ఆయన రాజీనామా చేయడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా గెలిచి అఖండ విజయాన్ని అందుకున్నారు. అయితే, రాణే వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఎన్సీపీ , శివసేన సహా ప్రముఖ జర్నలిస్ రాజ్‌దీప్ సర్దేశాయ్ విమర్శలు చేశారు. ఇలాంటి వాళ్లు అసెంబ్లీలో జైల్లో ఉండాలని రాజ్‌దీప్ సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేర్ మాట్లాడుతూ.. ‘వచ్చే ఎన్నికల్లో కేరళ నుంచి బీజేపీ పోటీ చేస్తుందో లేదో మీ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను అడిగి తెలుసుకోండి. 

Also Read: Hyderabad: నగరవాసులకు అదిరిపోయే వార్త..కొత్త సంవత్సరంలో బొనాంజా ఆఫర్‌..క్యాబ్స్‌, బైక్‌ రైడ్స్ ఫ్రీ!

రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిపోయింది’ అని మండిపడ్డారు. ఇక, రాణే వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంటారో లేదో చెప్పాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఎన్‌సీపీ (ఎస్‌పీ) నిలదీసింది. మోదీ మెజార్టీ లక్షకు పడిపోవడంతో ఆందోళన చెందుతున్న బీజేపీ నేతలు.. వయనాడ్‌లో ప్రియాంక గాంధీ గెలుపును జీర్ణించుకోలేకపోతున్నారని శివసేన (యూబీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read: TG News: దరఖాస్తు చేసుకుంటేనే రైతు భరోసా.. రేవంత్ సర్కార్ బిగ్ ట్విస్ట్

ఆయన్ను ఇంకా మంత్రి పదవిలో ఎందుకు కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోంధే పాటిల్ మండిపడ్డారు. ‘భారత సార్వభౌమాధికారం, ఐక్యతను కాపాడే రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఓ వ్యక్తి,..అది మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి  దేశంలోని ఓ రాష్ట్రాన్ని పాకిస్థాన్‌గా.. ప్రజలను ఉగ్రవాదులతో పోల్చారు. ఇంకా ఆయనకు మంత్రిపదవిలో ఉండడానికి అర్హుడేనా అంటూ ప్రశ్నించారు.

కాగా, తన వ్యాఖ్యలపై మంత్రి స్పష్టత ఇచ్చారు. ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘మనది హిందూ దేశంగానే ఉండాలి.. అన్ని విధాలుగానూ హిందువులను కాపాడుకోవాలి. భారత్‌లో కేరళ ముఖ్య రాష్ట్రం. అయితే, అక్కడ హిందూ జనాభా తగ్గడం ఆందోళన కలిగిస్తుంది. హిందువులను ముస్లింలు, క్రైస్తవులుగా మార్చుతున్నారు. అందుకే కేరళను నేను పాకిస్థాన్‌తో సరిపోల్చాను. పాక్‌లోని హిందువుల మాదిరిగానే కేరళలో పరిస్థితి ఉంది.. దీనిపై చర్యలు తీసుకోవాలి.. నేను నా ప్రసంగంలో ఇదే చెప్పానని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు