Ap: ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచిన ప్రభుత్వం..కానీ అక్కడ మాత్రం!

ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.

New Update
BREAKING: ఏపీలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

Ap: ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువను సరిచేస్తామని.. రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని ప్రకటించారు. రాష్ట్రంలోని ఏయే ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువ ఎంతెంత పెంచాలి.. ఎక్కడ తగ్గించాలి అనే అంశాలపై పూర్తి నివేదికను జనవరి 15వ తేదీలోగా అందించాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. 

Also Read: జనవరి 1 నుంచి ఈ 3 రకాల బ్యాంక్‌ అకౌంట్లు మూతపడనున్నాయి..వీటిలో మీ అకౌంట్‌ ఉందా చూసుకోండి మరి!

తాడేపల్లి ఐజీ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సోమవారం మీటింగ్‌ ఏర్పాటు చేశారు.  రాష్ట్రానికి రెవెన్యూ కూడా చాలా అవసరమని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలనుకుంటున్నట్లు  మంత్రి అన్నారు. అయితే రాష్ట్రంలో ఎక్కడెక్కడ గ్రోత్ కారిడార్లు ఉన్నాయో... ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ విలువలు పెంచనున్నట్లు చెప్పారు.

Also Read: Hyderabad: నగరవాసులకు అదిరిపోయే వార్త..కొత్త సంవత్సరంలో బొనాంజా ఆఫర్‌..క్యాబ్స్‌, బైక్‌ రైడ్స్ ఫ్రీ!

గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువల పెంపును శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించలేదని.. దీంతో చాలా ప్రాంతాల్లో భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు.. వాటిని సరిచేస్తున్నట్లు వివరించారు. అలాంటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువను తగ్గిస్తామని అన్నారు. భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరిగే చోట సగటున 15 శాతం నుంచి 20 శాతం వరకు ఛార్జీలు పెంచే అవకాశాలున్నాయని మంత్రి చెప్పారు.

Also Read: TAX: నాకూ తగ్గించాలనే ఉంది..పన్ను మినహాయింపుపై నిర్మలా సీతారామన్

ఇక చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూముల రిజిస్ర్టేషన్ విలువను తగ్గించనున్నట్లు  మంత్రి స్పష్టం చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో పెంపుదల, తగ్గింపు కానీ ఉండదని వివరించారు. రెవెన్యూ గ్రీవెన్సులలో వచ్చిన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టమన్నారు. నరసరావుపేటలో రూ. 12 లక్షలు ఉన్న భూమి విలువ ప్రస్తుతం రూ.1.8 కోట్లకు చేరిందని వివరించారు. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా భూములను గుర్తిస్తామన్నారు. రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి 50 నుంచి 60 అభ్యంతరాలు వచ్చాయని మంత్రి అన్నారు.

Also Read: అసలేం జరిగిందీ..నేనెక్కడున్నాను...జెజు ఫ్లైట్ మృత్యుంజయుడు

కమిటీ సిఫారసులు, గ్రోత్ కారిడార్ల అధ్యయనం ద్వారా రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచనున్నట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ విధానంలో 200 మంది డిజిటల్ అసిస్టెంట్‌లను వినియోగించుకుంటామన్నారు.  ఇప్పటికే రెవెన్యూ శాఖలో రూ.6200 కోట్లు ఆదాయం ఉందని..అది మార్చి నాటికి అది రూ. 10వేల కోట్లు దాటే అవకాశం ఉందని చెప్పారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు