Tirumala: తిరుమలలో జనవరి 10 నుంచి 19 వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీధర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి అన్నమయ్య భవనంలో సమావేశం నిర్వహించారు. అదనపు ఈవో టీటీడీ అధికారులు, పోలీసులకు వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లపై పలు ముఖ్య సూచనలు ఇచ్చారు. Also Read: Ap: ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచిన ప్రభుత్వం..కానీ అక్కడ మాత్రం! ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి రోజుల్లో పోలీసుల సమన్వయంతో వాహనాల రాకపోకలు సజావుగా ఉండేలా చర్యలు తీసుకుని తిరుమలలో ప్రత్యేక పార్కింగ్ లు ఏర్పాటు చేయాలన్నారు. Also Read: జనవరి 1 నుంచి ఈ 3 రకాల బ్యాంక్ అకౌంట్లు మూతపడనున్నాయి..వీటిలో మీ అకౌంట్ ఉందా చూసుకోండి మరి! దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలు ఉంటాయని అవగాహన కల్పించేందుకు రేడియో, బ్రాడ్‌కాస్టింగ్, సోషల్ మీడియా, ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, ఎస్వీబీసీ ప్రోమోలు, సూచిక బోర్డుల ద్వారా ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఆ పది రోజుల్లో దర్శనం కోసం ఎక్కువ సేపు వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు టోకెన్లు లేదా టికెట్ల పైన ఉన్న నిర్దేశిత తేదీ-సమయం ప్రకారం మాత్రమే భక్తులను దర్శనాలకు అనుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు. Also Read: Hyderabad: నగరవాసులకు అదిరిపోయే వార్త..కొత్త సంవత్సరంలో బొనాంజా ఆఫర్..క్యాబ్స్, బైక్ రైడ్స్ ఫ్రీ! వాహనాల రద్దీని నివారించడానికి పార్కింగ్ స్లాట్‌లను వికేంద్రీకరించాలని.. దాదాపు 13,000 వాహనాల కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. గరుడ సేవ తరహాలోనే రామ్ భగీచా వద్ద ఎక్కువ సంఖ్యలో బగ్గీలను ఏర్పాటు చేయాలని సూచించారు. వైకుంఠ ఏకాదశి రోజున సరైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, స్థానిక పోలీసులతో పాటు ఆక్టోపస్ టీమ్ సేవలను ఉపయోగించుకోవాలని టీటీడీ భద్రతా అధికారులకు చెప్పారు. Also Read: ADR Report: రిచ్ చంద్రబాబు..పూర్ మమత..ఏడీఆర్ నివేదిక తిరుమల స్వామివారి ఆలయంలో 25 రోజుల పాటు జరుగనున్న అధ్యయనోత్సవాలు సోమవారం సాయంత్రం ఘనంగా మొదలయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.