Indore Transgenders : షాకింగ్ ఇన్సిడెంట్.. లైవ్ లో ఫినాయిల్ తాగిన 25 మంది ట్రాన్స్‌జెండర్లు

ఇండోర్‌లోని నందలాల్‌పురాలో ట్రాన్స్ జెండర్ల మధ్య వివాదం కారణంగా సుమారు 25 మంది మూసి ఉన్న గదిలో సామూహికంగా ఫినాల్ తాగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని ఎంవై ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

New Update
_Madhya Pradesh Indore 25 transgenders consumed phenyl

Madhya Pradesh Indore 25 transgenders consumed phenyl

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. నందలాల్‌పురా ప్రాంతంలోని సుమారు 25 మంది ట్రాన్స్‌జెండర్ల బృందం ఫినైల్ తాగినట్లు సమాచారం. మూసి ఉన్న గదిలో సామూహికంగా ఫినైల్ తాగినట్లు తెలిసింది. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది. తీవ్ర అస్వస్థతకు గురైన ట్రాన్స్‌జెండర్ల బృందాన్ని తక్షణమే మహారాజా యశ్వంతరావ్ హాస్పిటల్ (MYH)కు తరలించారు. 

Also Read :  మరో ఘోరం.. మందు తాగించి మత్తులోకి దించి.. రేప్ చేసిన క్లాస్ మేట్

నగరంలోని పంధారినాథ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని నందలాల్‌పురాలో ఒక ట్రాన్స్ జెండర్(Indore transgender) ఫినైల్(Phenyl) తాగినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గది తలుపు తెరిచి మొత్తం 25 మంది ట్రాన్స్‌జెండర్లను ఆసుపత్రిలో చేర్చారు. వీరందరూ తాము సామూహికంగా ఫినైల్ తాగామని ఆరోపించారు. MYH వైద్యులు వీరి హెల్త్ పై అప్డేట్ అందించారు. 25 మంది రోగులు ఇప్పుడు ప్రమాదం నుండి బయటపడ్డారని, చికిత్స పొందుతున్నారని తెలిపడంతో అంతా ఊపరి పీల్చుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్-ఇన్-ఛార్జ్ డాక్టర్ బసంత్ కుమార్ నింగ్వాల్ మాట్లాడుతూ.. ఏ ఒక్క పేషెంట్ పరిస్థితి కూడా ప్రమాదకరంగా లేదని, వారంతా చికిత్స పొందుతున్నారని తెలిపారు. 

Also Read :  Diwali 2025: రైల్వేశాఖ షాకింగ్ నిర్ణయం.. అక్టోబర్ 28 వరకు టిక్కెట్లు బంద్

ఈ చర్యకు కారణం

ఇండోర్‌లో ట్రాన్స్‌జెండర్ల మధ్య జరిగిన వివాదం ఈ చర్యకు కారణమైందని తెలుస్తోంది. నందలాల్‌పురా ప్రాంతంలో ట్రాన్స్‌జెండర్ల సమూహాల మధ్య చాలా రోజులుగా వివాదం కొనసాగుతోంది. ఇటీవల ఇద్దరు మీడియా ఉద్యోగులు ఒక ట్రాన్స్‌జెండర్ మహిళపై అత్యాచారం చేసిన కేసు కూడా ఈ వివాదంలో తీవ్రమైందిగా పరిగణించబడింది. ఈ వివాదంపై దర్యాప్తు చేయడానికి గతంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కూడా ఏర్పాటు చేశారు. 

సాధారణంగా ట్రాన్స్‌జెండర్ల సమాజం తమ హక్కులు, గౌరవం, సామాజిక అంగీకారం లేకపోవడం, లైంగిక వేధింపుల వంటి వివిధ సమస్యల కారణంగా తీవ్ర ఒత్తిడికి, నిరాశకు గురవుతున్నారు. ఈ సంఘటన వెనుక ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు, సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ సంఘటన ట్రాన్స్‌జెండర్ల సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు, మానసిక ఆరోగ్య సమస్యల గురించి తీవ్రమైన చర్చకు దారితీసే అవకాశం ఉంది. 

Advertisment
తాజా కథనాలు