VIRAL NEWS: అక్క వద్దు.. చెల్లినే పెళ్లాడతా - వివాహానికి ఒక్కరోజు ముందు బాంబ్ పేల్చిన వరుడు!

MPలోని రీవా జిల్లాలో వింతఘటన జరిగింది. ఓ యువతికి ఈనెల 18న వివాహం జరిగేలా డేట్ ఫిక్సయింది. పెళ్లికి సరిగ్గా ఒకరోజు ముందు వధువు తండ్రికి వరుడు ఫోన్ చేసి, పెద్దమ్మాయి వద్దు..చిన్నకుమార్తెను పెళ్లాడతానని అన్నాడు. ఈ విషయం తెలిసి వధువు ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

New Update
madhya pradesh groom shocking decision

madhya pradesh groom shocking decision

మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి పనులు అన్నీ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పెళ్లికి ఒకరోజు ముందు ఆ యువకుడు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. వధువు తండ్రికి ఫోన్ చేసి తనకు పెళ్లి కూతురు వద్దని.. ఆమె చెల్లితో పెళ్లి చెయ్యాలని చెప్పాడు. అది తెలిసిన వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: TS: తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగాలు..సీఎం రేవంత్ ఒప్పందాలు

అక్క వద్దు చెల్లెలు కావాలి

స్థానిక యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల అంటే ఏప్రిల్ 18న మ్యారేజ్ జరిగేలా పెద్దలు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 16వ తేదీన వధువుకు బొట్టు పెట్టే ‘తిలకోత్సవ్‌’ వేడుక గ్రాండ్‌గా జరిగింది. అయితే పెళ్లికి సరిగ్గా ఒకరోజు ముందు అంటే ఏప్రిల్ 17న వరుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. 

Also Read: Woman Elopes: 43ఏళ్ల వయసులో ఇదేం పని ఛీఛీ.. వీయ్యంకుడితో లేచిపోయిన మహిళ

నేరుగా వధువు తండ్రికి ఫోను చేశాడు. ‘‘మీ కూతురు వద్దు.. చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను’’ అని చెప్పాడు. దీంతో వధువు తండ్రి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక వరుడు మాట్లాడిన మాటలు వధువు చెవిన పడ్డాయి. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె రీవాలోని సంజయ్‌గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. 

Also read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత

కాగా ఈమెకు ఇదివరకే మ్యారేజ్ అయి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. ఇప్పుడు పెళ్లి ఆగిపోవడంతో మరింత కుంగిపోయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారం పోలీసుల దాకా వెల్లడంతో.. దీనిపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని మన్‌గవా పోలీసులు తెలిపారు.

crime news | latest-telugu-news | telugu-news | Fake Marriages

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు