/rtv/media/media_files/2025/07/11/love-jihad-2025-07-11-20-31-03.jpg)
Love jihad
Love jihad : హిందూ మహిళలను ప్రేమ పేరుతో వలలో వేసుకుని పెళ్లి చేసుకుని వారిని ఇస్లాం మతంలోకి మార్చేందుకు పన్నిన కుట్రను మధ్యప్రదేశ్ పోలీసులు భగ్నం చేశారు. లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతులను టార్గెట్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా ఈ ఘటనలో ఈ కేసులో ఇండోర్‌కు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ అన్వర్ ఖాద్రీ కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఈ కేసులో ఖాద్రీపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద కేసు నమోదు చేశారు.
Also Read: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్
కాగా, ఖాద్రీ ముగ్గురు వ్యక్తులకు డబ్బులు ఇచ్చి హిందూ మహిళల్ని ట్రాప్ చేయాలని ప్రోత్సహించినట్లు తేలడంతో ఈ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ విషయమై రెండు వారాల క్రితం బంగంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు మేరకు సాహిల్ షేక్,అల్తాఫ్ అలీ అనే ఇద్దరిని ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరిద్దరూ కూడా హిందూ యువతులను ప్రేమ పేరుతో వలలో వేసుకుని తమ మతపరమైన గుర్తింపును దాచిపెట్టి హిందూవులుగా నటించినట్లు తేలింది. అంతేకాక, తమను లైంగికంగా వేధించారని ఇద్దరు మహిళలు ఫిర్యాదు చేశారు. కాగా వారిని అరెస్ట్ చేసి విచారించగా కాంగ్రెస్ నాయకుడు ఖాద్రీ పాత్ర బయటపడింది.
Also Read: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్
కాగా అరెస్ట్ అయిన సాహిల్ షేక్,అల్తాఫ్ అలీ కు హిందూ మహిళల్ని వివాహం చేసుకుని, వారిని ఇస్లాంలోకి మార్చేందుకు సాహిల్ కు రూ. 2 లక్షలు, అల్తాఫ్ కు రూ. 1 లక్ష ఇచ్చినట్లు తేలింది. పోలీసులు ఖాద్రీపై మత స్వేచ్ఛా చట్టం, భారత శిక్షాస్మృతిలోని ఇతర విభాగాల కింద కేసు నమోదు చేశారు. ఇండోర్ జిల్లా కలెక్టర్ ఇతడిపై జాతీయ భద్రతా చట్టం ప్రకారం కేసు పెట్టేందుకు అమోదం తెలిపారు. అయితే ఖాద్రీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.ఈ విషయమై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా స్పందించారు. నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పారు. ఖాద్రీ దోషిగా తేలితే శిక్షతప్పదని హెచ్చరించారు.
Also Read: రక్తపోటు పెరగడానికి ఈ అలవాట్లే కారణమా..?ఈ రోజే దానిని తరిమి వేయండి..!!