/rtv/media/media_files/2025/03/25/LxG1dHjc0yn1Oom0ndus.jpg)
One Nation One Election
ఇటీవల కేంద్రం లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ రాజ్యంగ సవరణ బిల్లుపై అధ్యయనం చేసేందుకు మోదీ సర్కార్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)ని ఏర్పాటు చేసింది. అయితే కమిటీ కాల పరిమితిని పెంచడం కోసం తాజాగా లోక్‌సభ అంగీకారం తెలిపింది. బీజేపీ ఎంపీ పీపీ చౌదరి ప్రతిపాదించిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. వర్షకాల సమావేశాల చివరివారంలో మొదటిరోజు వరకు గడువు పొడిగించింది.
Also Read: సెలబ్రిటీలకు 72 గంటలే టైం.. సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్!
JPC on Jamili Elections
దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు జమిలి ఎన్నికలకు సంబంధించి 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లు భారత రాజ్యాంగ స్వరూపానికి భంగం కలిగించేలా ఉందని విపక్షాలు విమర్శించాయి. ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి(JPC)కి పంపించాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే 39 మంది ఎంపీలతో జేపీసీ కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిటీ జమిలి ఎన్నికల బిల్లును అధ్యయనం చేస్తోంది.
Also Read: షాకింగ్ ఘటన.. విమానాన్ని ఢీకొట్టి ఇంజిన్ లో పడిన పక్షి.. చివరికి ఏమైందంటే..!?
అయితే ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 27, రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలున్నాయి. ఈ కమిటీ కాలపరిమితి ఏప్రిల్ 4న ముగియనుంది. అయితే బిల్లుపై చేయాల్సిన పని ఇంకా మిగిలే ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై పలువురు న్యాయనిపుణులతో సంప్రదింపులు కూడా జరిగినట్లు చెప్పాయి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ రంజన్ గొగోయ్, ప్రఖ్యాత న్యాయకోవిదుడు హరీశ్ సాల్వే, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.పి.షాలు కమిటీ ముందు హాజరయ్యారని పేర్కొన్నాయి. వీళ్లు కమిటీకి తమ అభిప్రాయాలు చెప్పినట్లు తెలిపాయి. అయితే జేపీసీ గడువు పొడిగించే తీర్మానానికి లోక్‌సభ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
Also Read: పార్లమెంట్‌లో చావా మూవీ.. స్పెషల్ స్క్రీన్‌లో వీక్షించనున్న మోదీ
Also Read: మా ఎన్నికల్లో జోక్యానికి భారత్ ప్రయత్నిస్తుందంటూ...కెనడా గూఢచారి సంస్థ సంచలన ఆరోపణలు!
telugu-news | rtv-news | jamili-elections | jamili elections bill in parliament | national-news | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu