ఎర్రకోట అప్పగించాలని మొఘల్‌ వారసుల పిటిషన్‌.. చివరికి

ఎర్రకొటను తమకు అప్పగించాలని మొఘల్ వారసులు గతంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. బ్రిటిషు వారు స్వాధీనం చేసుకున్న 150 ఏళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించడాన్ని తప్పుబట్టింది.

New Update
Red FOrt

ఎర్రకొటను తమకు అప్పగించాలని మొఘల్ వారసులు గతంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. బ్రిటిషు వారు స్వాధీనం చేసుకున్న 150 ఏళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించడాన్ని బెంచ్‌ తప్పుబట్టింది. ఎర్రకోటను తమ పూర్వీకులు నిర్మించారని, దాన్ని తమకు తిరిగి ఇచ్చేయాలని మొఘల్ చక్రవర్తి బహదూర్‌ షా జాఫర్‌-2 మునిమవడి భార్య సుల్తానా బేగం ఢిల్లీ హైకోర్టులో 2021లో పిటిషన్‌ వేశారు.    

ఇది కూడా చూడండి: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్

బ్రిటిష్ ఈస్డిండియా కంపెనీ తమ పూర్వీకుల నుంచి అక్రమంగా ఎర్రకోటను స్వాధీనం చేసుకుందని చెప్పారు. మొదటి స్వాతంత్ర్య యుద్ధం జరిగిన తర్వాత మొఘలులకు సంబంధించిన ఆస్తులు, కట్టడాలను బ్రిటిష్‌ వారు ఆక్రమించుకున్నట్లు పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్యం వచ్చాక ఎర్రకోటను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలిపారు. దీంతో తమ ఆస్తిని తిరిగి ఇప్పించాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వం అప్పగించేందుకు సిద్ధంగా లేకుంటే తమకు తగిన పరిహారం ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. 

ఇది కూడా చూడండి: న్యూ ఇయర్‌ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే!

అయితే దీనిపై తాజాగా విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. బ్రిటీష్ వారు ఎర్రకొటను ఆక్రమించుకున్న 150 ఏళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించడాన్ని తప్పుబట్టింది. కోర్టుకు అప్పీల్‌ చేసుకోవడంలో ఎక్కువగా ఆలస్యం కావడంతో పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. అయితే 2021లో దీనిపై అప్పీ్ల్‌ దాఖలు చేశానని, తన కుమార్తె మరణం వల్ల కుంగిపోయి మళ్లీ కోర్టును ఆశ్రయించలేకపోయానని సుల్తానా బేగం కోర్టుకు చెప్పారు. 

Also Read: భార్యల వేధింపులకు భర్తలు బలి.. ఎన్ని ఘోరాలు జరిగాయంటే?

Also Read: అలా అయితే సగం మంది రాజకీయ నాయకులు జైలుకే! బ్రహ్మాజీ సంచలన వ్యాఖ్యలు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు