గ్లోబల్ లాంచ్ లో భాగంగా భారత్ లో కియా సైరోస్ ఎస్యూవీని గత నెల డిసెంబర్‌లో లాంచ్ అయింది. ఇది కియా నుండి వచ్చిన ఐదవ ఎస్ యూవీ. కియా సోనెట్ లాగానే సైరోస్ కూడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. దీనిని కియా తన "న్యూ స్పీషీస్ ఆఫ్ ఎస్యూవీ" గా పిలుస్తోంది. ఈ కార్ పెట్రోల్, డీజిల్ రెండు విభాగాల్లో లభించనుంది. కార్నివాల్, ఈవీ3, ఈవీ9 స్ఫూర్తితో సైరోస్‌ను డిజైన్ చేసామని కంపెనీ నిర్వాహకులుచెప్పారు. అయితే దీని ధరను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఫిబ్రవరిలో ధరను చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సైరోస్ అడ్వాన్స్ బుకింగ్‌ను ప్రారంభించింది కియా. ఈరోజు నుంచి సైరోస్‌ను బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఆన్‌లైన్‌లో లేదా వారి సమీప డీలర్ దగ్గర కానీ 25 వేలు అడ్వాన్స్ ఇచ్చి బుకింగ్‌ను కన్ఫార్మ్ చేసకోవచ్చునని తెలిపింది. కారును ఫిబ్రవరిలో డెలివరీ చేస్తామని చెప్పింది. కియా సైరోస్ ఫీచర్లు ఇవే.. లెవెల్ 2 అడాస్ సూట్రిక్లైనింగ్, స్లైడింగ్ మధ్యవరుస సీట్లు6 ఎయిర్‌బ్యాగ్‌లు 360 డిగ్రీ కెమేరానిలువుగా అమర్చిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు17.3 అంగుళాల 3 పెటల్ అలాయ్ వీల్స్465 లీటర్ల బూట్స్పేస్సోనెట్ కంటే ప్రీమియంగా కనిపించే కొత్త డ్యాష్బోర్డువైర్లెస్ ఆండ్రాయిట్ ఆటో/యాపిల్ కార్‌ప్లే12.3 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ఇంటిగ్రేటెడ్ ఏసీ వెంట్లు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 1.5 లీటర్ సీఆర్‌డీఐ డీజిల్ ఇంజిన్ Also Read: Cricket: 140 Kmph వేగంతో స్టార్క్ బంతి..రిషబ్ పంత్ చేతికి గాయం