Odisha: ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్- కారు- ఆటో ఢీ.. ముక్కలైన ప్రయాణికులు
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక బైకర్ అతివేగంగా వెళ్తూ ట్రాక్టర్ ను ఓవర్ టెక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టాడు. కారు డ్రైవర్ అదుపుతప్పి పక్కనున్న ఆటోను ఢీ కొట్టాడు. ఆటో మరో రెండు బైకులను ఢీ కొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. 13 మంది గాయపడ్డారు.