Dharmasthala: ధర్మస్థలలో కీలక పరిణామం.. బయటపడిన అవశేషాలు
ధర్మస్థల మిస్టరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. దీనిపై విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చేపట్టిన తవ్వకాల్లో మనిషికి చెందిన అస్థిపంజర అవశేషాలు బయటపడినట్లు తెలుస్తోంది.