/rtv/media/media_files/2025/08/25/mla-2025-08-25-11-27-54.jpg)
కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాలక్కాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్‌పై పలువురు మహిళలు లైంగిక వేధింపుల(sexual-assault) ఆరోపణలు చేయడంతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. 2025 ఆగస్టు 25వ తేదీ సోమవారం ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. కాగా ఇప్పటికే కేరళ యువజన కాంగ్రెస్(Kerala Congress) అధ్యక్ష పదవికి రాహుల్ మమ్‌కూటథిల్ రాజీనామా చేశారు. కాగా వారం రోజుల క్రితం మలయాళ నటి, మాజీ జర్నలిస్ట్ రిని ఆన్ జార్జ్ ఓ రాజకీయ నాయకుడు తనను పదే పదే అభ్యంతరకరమైన సందేశాలు పంపారని, తనను ఒక హోటల్‌కు కూడా రమ్మంటూ అసభ్యంగా సందేశాలు పంపాడాని ఆరోపించడంతో ఈ వివాదం ప్రారంభమైంది . ఆమె ఎవరి పేరు చెప్పకుండానే ఈ కామెంట్స్ చేశారు. రచయిత్రి హనీ భాస్కరన్, అవంతిక అనే ట్రాన్స్ మహిళ కూడా ఎమ్మెల్యే మమ్‌కూటథిల్ తమను లైంగికంగా వేధించాడంటూ కామెంట్స్ చేశారు.
Political Party Of Predators ( Congress )
— INDIAN (@hindus47) August 25, 2025
Kerala Pradesh Congress Committee (KPCC) has suspended their MLA Rahul Mamkootathil from the party's primary membership for six months following allegations of sexual misconduct.
Also Read : ఎయిరిండియా విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ.. చివరికి
రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటన
ఒక మహిళను గర్భస్రావం చేయమని బలవంతం చేసి, బెదిరించాడని ఆరోపిస్తూ ఒక ఆడియో క్లిప్ కూడా వైరల్ అయింది. ఈ ఆడియో క్లిప్‌లో అతని స్వరం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా రాహుల్ మమ్‌కూటథిల్ ప్రకటించారు. తనపై వచ్చిన ఆరోపణలను రాహుల్ ఖండించారు. ఇవి రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని, తనను అప్రతిష్టపాలు చేయడానికే ఈ కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. ఆరోపణలు చేసిన మహిళలు తన పేరు ప్రస్తావించలేదని, ఎలాంటి అధికారిక ఫిర్యాదు చేయలేదని కూడా ఆయన పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, ఈ వ్యవహారాన్ని వ్యక్తిగతంగా ఎదుర్కొంటానని తెలిపారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని సీరియస్‌గా తీసుకుని సస్పెండ్ చేసింది.
రాహుల్ మమ్కూటథిల్ తన రాజకీయ జీవితాన్ని విద్యార్థి దశలోనే ప్రారంభించారు. ఆయన 2006లో కేరళ స్టూడెంట్స్ యూనియన్ (KSU)లో చేరారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న షఫీ పరంబిల్ లోక్ సభకు ఎన్నికైన తర్వాత, రాహుల్ మమ్కూటథిల్ ఆయన వారసుడిగా కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. షఫీ పరంబిల్ ఖాళీ చేసిన పాలక్కాడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో రాహుల్ మమ్కూటథిల్ పోటీ చేసి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సి. కృష్ణకుమార్ మరియు సీపీఐ(ఎం) అభ్యర్థి పి. సారన్‌లను ఓడించి 18,724 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఈ విజయం ఆయనను పార్టీలో ఒక యువ నాయకుడిగా నిలబెట్టింది.
Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్