/rtv/media/media_files/2025/01/19/52va0igQZKpwQZSq6zWs.jpg)
Karnataka Photograph: (Karnataka )
కర్ణాటకలోని బీదర్ జిల్లా జలసంగి గ్రామంలో శాటిలైట్ పేలోడ్ బెలూన్ ఓ ఇంటిపై పడింది. ఎయిర్‌బ్యాగ్‌లా ఉన్న బెలూన్‌కు పెద్ద యంత్రం అమర్చి ఉండటంతో పాటు అందులో రెడ్ లైట్ కూడా వెలిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందులో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ బెలూన్ సర్వీస్ అని కన్నడ భాషలో రాసి ఉన్న లేఖ కూడా ఉంది. దీంతో గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ పేలోడ్‌ను సేకరించేందుకు పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. శాటిలైట్ పేలోడ్ బెలూన్‌ను ప్రయోగం కోసం ఎగుర వేశారని, ఇలా తరచుగా ప్రయోగాలు చేస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది.
A huge satellite payload balloon landed on the roof of a house in the local Jalasangi village of Bidar district in the early hours of the morning.
— Media5Zone News (@media5zone) January 19, 2025
The police found that the balloon had been left at Tata Institute of Fundamental Research (TIFR)-Hyderabad from the letter in it. pic.twitter.com/kWqiI1KpZm
ఎలాంటి నష్టం జరగకపోవడంతో..
శాటిలైట్ పేలోడ్ బెలూన్ అనేది భూమిపైన ఉన్న శాస్త్రీయ యంత్రాల ఎలక్ట్రానిక్ భాగాలను వాతావరణంలోకి తీసుకువెళ్తారు. ఆ తర్వాత పేలోడ్ బెలూన్ నుంచి విడిపించి, పారాచూట్ ద్వారా భూమికి తిరిగి తీసుకువెళ్తారు. అయితే ఈ పేలోడ్ మళ్లీ టేకాఫ్ అవుతున్న సమయంలో గ్రామంలో పడిపోయే అవకాశం ఉన్నట్లు భావించారు. ఇంటి పైకప్పుపై బెలూన్ పడటంతో ఎలాంటి నష్టం జరగలేదు. దీంతో గ్రామస్థులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చూడండి: Karnataka: చికెన్, మటన్ విక్రయాలు బంద్.. ఎందుకో తెలుసా!
పేలోడ్ బెలూన్ ఒక రకమైన స్పేస్ క్యాప్సూల్. ఇందులో 2.8 లక్షల క్యూబిక్ మీటర్ల హీలియం వాయువు ఉంది. ఇందులో కూర్చోవడం వల్ల అంతరిక్షంలోకి తీసుకెళ్లవచ్చు. ఇలాంటి బెలూన్లతో ప్రజలు అంతరిక్షంలోకి చేరవచ్చట. అయితే ఈ ప్రయోగాన్ని స్పానిష్ కంపెనీ చేసింది. ఈ స్పేస్ క్యాప్సూల్‌లో కూర్చోవడం వల్ల ప్రయాణికులు భూమికి 40 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లగలరు. అయితే అక్కడికి వెళ్లి తిరిగి, రాగలమా? లేదా? అని ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. అయితే 2022 డిసెంబర్‌లో వికారాబాద్‌లోని మొగిలిగుండ్ల గ్రామంలో కూడా ఇలానే ఎగిరే వస్తువు కనిపించింది.
ఇది కూడా చూడండి: Breaking News: ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత మృతి
ఇది కూడా చూడండి:RBI: బ్యాంకు అకౌంట్ల పై ఆర్బీఐ కీలక ప్రకటన..ఆ పని చేయలేదో నష్టం మీకే!