/rtv/media/media_files/TqbZXet3vokljG4sL939.jpg)
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బెందిరింపు వస్తున్నాయని మీడియాతో అన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. స్పీకర్ యుటి ఖాదర్‌కు బెదిరింపు కాల్ వచ్చిందంటూ విలేకరులు సీఎం ప్రశ్నను అడిగారు. దానికి సిద్ధరామయ్య సమాధానం ఇస్తూ.. అవును.. నాకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఏం చేయాలి..? పోలీసులకు సమాచారం ఇచ్చామని అన్నారు. బెదిరింపు కాల్స్ చేస్తున్న వారిని కనుగొని వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాము’ అని సీఎం సిద్ధరామయ్య విలేకరులతో అన్నారు. మంగళూరులో జరిగిన రౌడీషీటర్ సుహాస్ శెట్టి హత్య ఘటన నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
Also read: BIG BRAKING : అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ అలర్ట్
మంగళూరులో రౌడీ షీటర్ సుహాస్ శెట్టి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఐదుగురు వ్యక్తులు కొడవల్లు, కత్తులతో నడిరోడ్డుపై నరికి చంపేశారు. ఈ ఘటనతో మంగళూరులో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రజలు గుమిగూడడాన్ని నిషేధించారు. ఊరేగింపులు, నినాదాలు చేయడం, ఆయుధాలను పట్టుకెళ్లడాన్ని నిషేధించారు. సుహాస్‌ను పథకం ప్రకారమే హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
Also read: INDIA PAK WAR: బద్మాష్ బంగ్లాదేశ్.. పాక్ పక్కన చేరి ఇండియానే ఆక్రమించుకోవాలని ప్లాన్..!
(CM Siddaramaiah | cm-sidda-ramaiah | karnataka-cm-siddaramaiah | threats | death-threats | latest-telugu-news)