BIG BRAKING : అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ అలర్ట్

అర్జెంటీనాలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. తీర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూమి కంపించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. అర్జెంటీనాలోని ఉషుయాకు దక్షిణంగా 219 కి.మీ దూరంలో ఉన్న డ్రేక్ పాసేజ్ వద్ద ప్రకంపనలు సంభవించాయి.

New Update
Argentina Earthquake

అర్జెంటీనా దేశాల్లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. తీర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూమి కంపించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. అర్జెంటీనాలోని ఉషుయాకు దక్షిణంగా 219 కి.మీ దూరంలో ఉన్న డ్రేక్ పాసేజ్ వద్ద ప్రకంపనలు సంభవించాయి. దీంతో పాటు పలుచోట్ల భూమి కంపించిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు భయంతో ఇళ్లు నుంచి పరుగులు పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also read: INDIA PAK WAR: బద్మాష్ బంగ్లాదేశ్.. పాక్‌ పక్కన చేరి ఇండియానే ఆక్రమించుకోవాలని ప్లాన్..!

Also read: పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానల్‌ని బ్లాక్ చేసిన భారత్

అర్జెంటీనాలోని ఉషుయా నగర తీరానికి 219 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని USGS తెలిపింది. భూకంపం తర్వాత వెంటనే సునామీ హెచ్చరిక జారీ చేశారు. దీనితో అధికారులు ప్రజలు తీరం నుంచి దూరంగా వెళ్లి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల పరిధిలోని తీరప్రాంతాలకు దక్షిణ అర్జెంటీనా, చిలీలోని కొన్ని ప్రాంతాలకు US సునామీ హెచ్చరికలు జారీ చేసింది.  చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ సోషల్ మీడియాలో మగల్లనెస్ ప్రాంత తీరప్రాంతంలో అందరూ ఖాళీ చేయాలని కోరారు. మాగల్లనెస్ ప్రాంతమంతటా తీరప్రాంతాన్ని ఖాళీ చేయాలని అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ Xలో పోస్ట్ చేశారు.

(earthquake | argentina | tsunami | warning | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు