Viral Video: కండలా.. నీలగిరి కొండలా - వధువు బాడీ చూస్తే మతి పోవాల్సిందే గురూ!

కర్ణాటకకు చెందిన చిత్ర పురుషోత్తం అనే మహిళ ఇటీవల పెళ్లి చేసుకుంది. తన వివాహ లుక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆమె తన కండలు చూపించి అందరినీ ఆశ్చర్యపరచింది. చీరలో బాడీ బిల్డింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆ వీడియో 7మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది.

New Update
Karnataka bodybuilder bride Chitra Purushotham wedding look

Karnataka bodybuilder bride Chitra Purushotham wedding look

సాధారణంగా పురుషులు ఎక్కువగా ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెడతారు. కండల తిరిగిన బాడీ కోసం ఏళ్లకు ఏళ్లు కష్టపడతారు. దాని కోసం జిమ్‌లలో గంటలు గంటలు తరబడి వర్కౌట్ చేస్తుంటారు. అలా చివరికి తమకు కావాల్సిన బాడీని ఫిట్ అండ్ స్ట్రాంగ్‌గా ఉంచుకుంటారు. అయితే ఇదంతా ఓకే కానీ.. మహిళలు కూడా కండలు తిరిగిన బాడీ కోసం ప్రయత్నిస్తున్నారు. 

అవును మీరు విన్నది నిజమే. అందుకు ఉదాహరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో. ఆ వీడియోలో ఓ మహిళ తన బాడీతో మెస్మరైజ్ చేసింది. వామ్మో అనేలా ఆ మహిళ తన బాడీని ప్రదర్శించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. దాని ప్రకారం.. 

Karnataka bodybuilder bride

కర్ణాటకకు చెందిన చిత్ర పురుషోత్తం అనే మహిళ ఇటీవల పెళ్లి చేసుకుంది. తన చిరకాల ప్రియుడు కిరణ్ రాజ్‌ను వివాహం చేసుకుంది. ఇందులో భాగంగానే తన వివాహ లుక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో సంప్రదాయాన్ని, బలాన్ని ఉపయోగించి కనిపించింది. 

ఇది కూడా చదవండి: తమలపాకులను నీటిలో మరిగించి తాగితే మీలో ఈ మార్పు గ్యారంటీ

ఆమె ఒక బాడీబిల్డర్ అండ్ ఫిట్‌నెస్ ట్రైనర్ కావడంతో తన అసాధారణ వివాహ లుక్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. వధువు చిత్ర సంప్రదాయ చీరలో తన ప్రత్యేక రోజున టోన్డ్ శరీరాన్ని గర్వంగా ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. పసుపు, నీలం కాంజీవరం చీరలో బ్లౌజ్ లేకుండా ధైర్యంగా బాడీ బిల్డింగ్ ప్రదర్శన చేసింది. 

అందులో ఆమె తన కండలు చూపించి హీటెక్కించేసింది. చూస్తే జడుసుకునే విధంగా ఆమె తన బాడీని తీర్చిదిద్దుకుంది. పురుషులకు తామేమి తక్కువ కాదన్నట్లు ఆమె కండలు తిరిగిన బాడీతో శభాష్ అనిపించుకుంది. అందులోనూ పెళ్లి వెడ్డింగ్ షూట్‌లో ఇలాంటి ప్రదర్శన చేయడం గమనార్హం.

Also read: బంపరాఫర్.. ఆడపిల్లని కంటే తల్లిదండ్రులకు రూ.50 వేలు క్యాష్.. మగపిల్లాడైతే ఆవు గిఫ్ట్

మేకప్ లుక్‌తో మెడ నిండా మిల మిల మెరిసే ఆభరణాలు, చెవులకు దుద్దులు, చేతులకు గాజులు, నడుముకు వడ్డానం, ఆఖరిలో చిన్న స్మైల్‌తో నెటిజన్లను అట్రాక్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె కాస్త భిన్నంగా ఉండటంతో 7 మిలియన్లకు పైగా వీక్షణలతో చిత్ర వైరల్‌గా మారిపోయింది. 

ఇకపోతే చిత్ర తన ఇన్‌స్టాగ్రామ్‌లో 138k ఫాలోవర్లను కలిగి ఉంది. ఇక్క ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే.. చిత్ర పురుషోత్తమ్ అనేక అందాల పోటీలలో పాల్గొని మిస్ ఇండియా ఫిట్‌నెస్, వెల్‌నెస్, మిస్ సౌత్ ఇండియా, మిస్ కర్ణాటకతో సహా టైటిళ్లను గెలుచుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు