/rtv/media/media_files/2025/06/27/kanpur-man-got-his-wife-married-to-her-lover-after-15-years-of-marriage-2025-06-27-21-03-19.jpg)
Kanpur Man Got His Wife Married To Her Lover After 15 Years Of Marriage
ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న ఓ భర్త.. దగ్గరుండి వాళ్ల వివాహం జరిపించాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. యూపీలోని కాన్పూర్ జిల్లాలో రసూలాబాద్‌కు చెందిన యోగేష్ తివారీ(40) కూలీ పని చేస్తున్నాడు. 15 ఏళ్ల క్రితం అతనికి సోని(30) అనే మహిళతో పెళ్లి జరిగింది.
Also Read: కోల్‌కతా గ్యాంగ్ రేప్ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు
వీళ్లకు 12 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే కన్నౌజ్‌కు చెందిన 35 ఏళ్ల వికాస్ ద్వివేదితో సోనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తన భర్తకు తెలియడంతో వారిమధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఇటీవలే సోని తన పుట్టింటికి వెళ్లింది. జూన్ 23న మళ్లీ భర్త ఇంటికి వచ్చింది. అయితే ఆమె ప్రియుడు వికాస్ కూడా ఆ గ్రామంలో కనిపించాడు. ఇది గమనించిన యోగేష్ పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో అతడు అక్కడినుంచి పారిపోయాడు.
Also Read: భారీ వరదలు.. వందల మంది గల్లంతు.. ఒకే కుటుంబంలో 18మంది!
చివరికీ యోగేష్.. వికాస్‌కు ఫోన్ చేశారు. పరిస్థితిని తాను అర్థం చేసుకున్నానని చెప్పి తన గ్రామానికి పిలిపించాడు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. వికాస్‌ను వివాహం చేసుకుంటా అని సోనీ అందరి ముందు చెప్పేసింది. యోగేష్‌తో ఉన్న 15 ఏళ్ల వివాహ బంధాన్ని రద్దు చేసుకునేందుకు ఆమె ఒప్పుకుంది. అందరీ సమక్షంలో ఈ ఒప్పందంపై సోని సంతకం చేసింది. చివరికీ యోగేష్ తన భార్య సోని, ప్రియుడు వికాస్‌ను ఓ ఆలయానికి తీసుకెళ్లి గ్రామస్తుల సమక్షంలో వివాహం జరిపించాడు.