/rtv/media/media_files/2025/09/03/kamlal-haasan-2025-09-03-20-49-32.jpg)
Kamlal haasan
ఇటీవల వీధి కుక్కల అంశం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. వీధి కుక్కలను షెల్టర్ హోమ్‌కు తరలించిన ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై జంతు ప్రేమికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో చివరికి వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, వ్యాక్సిన్ ఇచ్చి మళ్లీ అవి ఉండే చోటే వదిలిపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విధి కుక్కలకు టీకా, స్టెరిలైజేషన్ వేయడాన్ని తప్పనిసరి చేసింది. అయితే ఈ వ్యవహారంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటించిన ఓ చిత్రంలోని డైలాగ్ వైరలవుతోంది.
Also Read: పగబట్టిన పాము.. 15 ఏళ్ల బాలికకు 42 రోజుల్లో 10 సార్లు కాటు.. డాక్టర్లు ఏం చెప్పారంటే?
కమల్ హాసన్ నటించిన ఆళవందాన్ అనే చిత్రం 2001లో రిలీజ్ అయ్యింది. అందులో వీధి కుక్కల గురించి ఉన్న ఓ డైలాగ్ వైరలవుతోంది. అందులో ''నేను పెంచిన కుక్కను ఎలా చంపగలను. అది పిచ్చిది అయితే మాత్రం చంపగలను'' అని ఉంటుంది. దీంతో వీధి కుక్కల సమస్య గురించి కమల హాసన్ ఎన్నో ఏళ్ల క్రితమే అవగాహన కల్పించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చివరికి దీనిపై కమల హాసన్ కూడా స్పందించారు. చెన్నై ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు.
Also Read: 2 కోట్ల ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసిన కేంద్రం.. ఎందుకో తెలుసా?
''ఈ వీధి కుక్కల సమస్యకు పరిష్కారం అనేది చాలా సులభమే. ఎన్నో శతాబ్దాల పాటు బరువులు మోసిన గాడిద ఈరోజు కనుమరుగైందని ఎవరైనా చింతిస్తున్నారా ? వాటిని రక్షించడం గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా ? అన్ని జంతువులను మనం రక్షించాలని'' కమల్ హాసన్ అన్నారు.
#Kamalhaasan's Solution for Stray Dogs Issue 🐕:
— Laxmi Kanth (@iammoviebuff007) September 3, 2025
"Solution is very simple.. The people who know history.. The people who know Social Hygiene.. Has anyone of these people worried about Where the donkeys are..? We need to save every animal.."pic.twitter.com/XawNUuualO
Also Read: భారత్‌పై ట్రంప్ మరోసారి ఫైర్.. అమెరికాని ఇండియా చంపేస్తోందంటూ..!
ఇదిలాఉండగా ఇటీవల ఢిల్లీలో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి మృతి చెందడం దుమారం రేపింది. అంతేకాదు ఎన్సీఆర్ పరిధిలో రేబిస్ మరణాల సంఖ్య పెరుగుతోందనే వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. రేబిస్ లక్షణాలు లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలను మినహా ఇప్పటిదాకా షెల్టర్లకు తరలించిన వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read: గాజాపై భీకర దాడులు 47 మంది మృతి.. హెచ్చరికలు జారీ చేసిన ఇజ్రాయెల్!