BREAKING: భారత్‌పై ట్రంప్ మరోసారి ఫైర్.. అమెరికాని ఇండియా చంపేస్తోందంటూ..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో వాణిజ్య సంబంధాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగే దొంగా.. దొంగా అన్నట్లు ఉంది ట్రంప్ వ్యవహారం. భారత్ టారిఫ్‌లతో తమను 'చంపేస్తోందని' ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

New Update
Trump

Trump

Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో వాణిజ్య సంబంధాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగే దొంగా.. దొంగా అన్నట్లు ఉంది ట్రంప్ వ్యవహారం. భారత్ టారిఫ్‌లతో తమను 'చంపేస్తోందని' ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ట్రంప్ ఓ రేడియో షోలో మాట్లాడుతూ, "చైనా, బ్రెజిల్ మాదిరిగానే, భారతదేశం కూడా మమ్మల్ని సుంకాలను ఉపయోగించి చంపేస్తోంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ట్రంప్ ఇటీవల భారత్‌పై సుంకాలు 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడం మానుకోకపోతే భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ఆ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను కొనసాగిస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన ట్రంప్ ప్రభుత్వం భారత్ ఎగుమతులపై 50 శాతం అదనపు సుంకాలు విధించింది. ఇది బ్రెజిల్ తర్వాత అత్యధిక టారిఫ్‌లు కావడం గమనార్హం.

ఈ పరిణామం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సుంకాల కారణంగా భారతీయ ఎగుమతులపై సుమారు 48 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రత్నాలు, వస్త్రాలు, రొయ్యల వంటి భారతీయ ఉత్పత్తుల ఎగుమతులు దెబ్బతిన్నాయి. అయితే, ఈ ఆరోపణలను భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. 

భారత్ తన ఇంధన భద్రత కాపాడుకునేందుకు రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తోందని, ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవడం సరికాదని భారత్ స్పష్టం చేసింది. అయితే, అమెరికా ప్రభుత్వంలో కొంతమంది అధికారులు ఈ వివాదం త్వరలో పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం ఎన్నికల ప్రచారం కోసమేనని, భవిష్యత్తులో ఈ వివాదం పరిష్కారమవుతుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు