Justice Surya Kant : తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం.. నవంబర్ 24న బాధ్యతలు

భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (CJI) గా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

New Update
cji

భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) తదుపరి ప్రధాన న్యాయమూర్తి (CJI) గా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్(Justice Surya Kant to be new CJI) నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.  భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ఆమోదంతో జస్టిస్ సూర్యకాంత్‌ను తదుపరి సీజేఐగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 

Also Read :  కూతురు మరణ వేదనలోనూ లంచాలతో వేధించారు.. మాజీ CFO సంచలన పోస్ట్!

జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24న దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హర్యానాకు చెందిన ఒక న్యాయవాది దేశంలోని అత్యున్నత న్యాయ పదవిని అధిష్టించడం ఇదే తొలిసారి కావడం విశేషం.  ప్రస్తుత సీజేఐ జస్టిస్ బి. ఆర్. గవాయ్ పదవీకాలం నవంబర్ 23న ముగుస్తుండటంతో ఆయన స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు.  

Also Read :  బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్లు ... ఆస్తులెంతో తెలుసా?

పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా

జస్టిస్ సూర్యకాంత్ గతంలో పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆర్టికల్ 370 రద్దు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (OROP) వంటి అనేక కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో ఆయన సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9 వరకు, అంటే సుమారు 14 నెలల పాటు ఈ అత్యున్నత పదవిలో కొనసాగుతారు. 

Advertisment
తాజా కథనాలు