మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ముగిసిన పోలింగ్..భారీగా నమోదయిన ఓటింగ్ మహారాష్ట్ర, జార్ఖండ్‌లో రెండోదశ పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి దాదాపు 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైందని అధికారులు చెబుతున్నారు. జార్ఱండ్‌లో నెల 13 జరిగిన మొదటి దశ పోలింగ్‌లోనూ భారీగా ఓటింగ్ నమోదయింది. By Manogna alamuru 20 Nov 2024 | నవీకరించబడింది పై 20 Nov 2024 18:33 IST in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Jarkhand Voting: జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నవంబర్ 13న తొలి విడతలో 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగతా 38 స్థానాలకు ఈ రోజు పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ జేఎంఎం–ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడ్డాయి. ఈ ఎన్నికల్లో అవినీతి, ప్రజాకర్షక హామీలు, కేంద్ర నిధుల విడుదల లాంటిఅంశాలు కీలకంగా నిలిచాయి. గత ప్రభుత్వంలోని సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ అవడం...దాంతో సీఎం మారడం..మళ్ళీ ఆయన జైలునుంచి తిరగి వచ్చి అధికారాన్ని చేజిక్కుంచుకోవడం ఇలా బోలెడు ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ సారి జార్ఖండ్ ఎన్నికలకు ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ఎన్నికల ఫలితాలు మరో రెండు రోజుల్లో అంటే నవంబర్ 23న విడుదల చేయనున్నారు. ఇది కూడా చూడండి: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు! ప్రశాంతంగా ముగిసిన ఓటింగ్.. జార్ఖండ్‌లో రెండో దశ పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలకు.. పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి ఓట్లు వేశారు.ఈనెల 13న జరిగిన తొలి విడతలో కూడా భారీగానే ఓటింగ్ నమోదైంది. అప్పుడు కూడా 70 శాతం దాకా ఓటింగ్ నమోదైంది. ఇది కూడా చూడండి: అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్! మహారాష్ట్ర.. మరోవైపు ఈరోజు మహారాష్ట్రలో కూడా పోలింగ్ ముగిసింది. ఇక్కడ సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఇక్కడ కూడా దాదాపు 60 శాతం ఓటింగ్ నమోదైంది. మామూలుగా అయితే ఇక్కడ ఇంకా ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. కానీ మహారాష్ట్రలో ఈరోజు పోలింగ్ కాస్త నెమ్మదిగా మొదలయింది. ప్రజలు కాస్త లేట్‌గా ఆవడంతో ముగిసే సమయానికి 60 మాత్రమే నమోదయిందని అధికారులు చెప్పారు. ఇది కూడా చూడండి: 9 ఏళ్లకే గర్భం దాల్చిన బాలిక.. షాకింగ్ వీడియో వైరల్! మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడత పోలింగ్ జరిగింది. మహాయుతి, మహా అఘాడీ మధ్య ఇక్కడ తీవ్ర పోరు ఉంది. 9.7 కోట్ల మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓటర్ల కోసం లక్షా 186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. మహాయుతిలో 149 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా.. శివసేన 81 స్థానాల్లో, ఎన్సీపీ 59 చోట్ల పోటీ చేసింది. అలాగే కాంగ్రెస్ 101 స్థానాల్లో పోటీ చేస్తోంది. శివసేన ( ఉద్ధవ్) 95, ఎన్సీపీ(ఎస్‌పీ) 86 చోట్ల పోటీ చేస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసారి చిన్న పార్టీలు తీవ్ర ప్రభావం చూపనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు. Also Read: ఎగ్జిట్ పోల్స్.. ఝార్ఖండ్‌లో ఆ పార్టీదే అధికారం #polling #jharkhand #maharashtra #voting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి