/rtv/media/media_files/2025/10/15/nitish-2025-10-15-15-43-30.jpg)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Elections 2025) నేపథ్యంలో, ముఖ్యమంత్రి నితీష్ కుమార్(cm-nitish-kumar) నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్ జేడీయూ) పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఎన్డీఏ సీట్ల పంపకంలో భాగంగా తమకు కేటాయించిన 101 సీట్లలో 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్ర కేబినెట్ మంత్రులైన మహేశ్వర్ హజారీ (కల్యాణ్‌పూర్), రత్నేష్ సదా (సోన్‌బర్సా), విజయ్ కుమార్ చౌదరి (సరైరంజన్), శ్రవణ్ కుమార్ (నలంద) వంటి సీనియర్ నాయకులకు మళ్లీ టికెట్లు దక్కాయి. మాజీ ఎమ్మెల్యే అనంత సింగ్‌కు మోకామా స్థానం నుంచి టికెట్ కేటాయించడం గమనార్హం. ఈ తొలి జాబితాలో నలుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు.
అయితే తమ మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఆశించినట్లుగా ఉన్న సోన్‌బర్సా, రాజ్‌గిర్, మోర్వా, గాయ్‌ఘాట్ వంటి కీలక స్థానాల్లో జేడీయూ అభ్యర్థులను నిలబెట్టడం కూటమిలో అంతర్గత విభేదాలకు సంకేతంగా చెప్పుకోవచ్చు. జేడీయూ తొలి జాబితాను విడుదల చేయడంతో, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రేపటి నుంచి తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఈ సారి కూడా నితీష్ కుమార్ పోటీలో నిలబడటం లేదు. నితీష్ కుమార్ గత సుమారు రెండు దశాబ్దాలుగా (1985 తర్వాత) అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఆయన ప్రస్తుతం బీహార్ శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి అసెంబ్లీ లేదా శాసన మండలి- ఈ రెండింటిలో దేనిలోనైనా సభ్యుడిగా ఉంటే సరిపోతుంది. నితీష్ కుమార్ మండలి మార్గాన్ని ఎంచుకున్నారు.
Janata Dal United (JDU) releases the first list of candidates for the Bihar Assembly Elections. pic.twitter.com/Zb2G7PZvv0
— ANI (@ANI) October 15, 2025
Also Read : JDU ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది.. నితీష్ కు దక్కని చోటు.. ఎందుకంటే?
71 మంది అభ్యర్థులతో బీజేపీ లిస్టు
ఇక బీజేపీ(bjp) నిన్న తమ తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 71 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరిని పార్టీ తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. బీజేపీ తన తొలి జాబితాలో తొమ్మిది మంది మహిళలను బరిలోకి దింపింది. వీరిలో రేణు దేవి, గాయత్రి దేవి, దేవంతి యాదవ్, రమా నిషాద్ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఇతర సీనియర్ నాయకులు హాజరైన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ఈ జాబితాను విడుదల చేశారు.
243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు(bihar-assembly-elections) రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 6 మొదటి దశ, నవంబర్ 11 రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. బీహార్ ఎన్నికలకు జేడియూ, బీజేపీ రెండూ సీట్ల పంపకాలను ఖరారు చేశాయి. ఒప్పందం ప్రకారం, 243 సీట్లకు గానూ బీజేపీ, జేడియూ చెరో 101 చోట్లలో పోటీ చేస్తుంది. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 29 సీట్లలో పోటీ చేస్తుంది. రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందుస్థానీ అవామ్ మోర్చా (జితన్ రామ్ మాంఝీ)లకు ఒక్కొక్కరికి ఆరు సీట్లు కేటాయించారు. NDA కూటమిలో JD(U), LJP (రామ్ విలాస్), HAM (సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చా ఉన్నాయి.
Also Read : ఆర్‌జేడీలో ముసలం..అభ్యర్థులకు టికెట్లిచ్చిన లాలూ.. వెనక్కి తీసుకున్న తేజస్వి..