BREAKING: భద్రతా దళాలపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి

మణిపూర్‌ రాజధాని ఇంపాల్‌లో విషాదం చోటుచేసుకుంది. అస్సాం రైఫిల్స్‌ దళాలు వెళ్తున్న వాహనంపై కొందరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. తుపాకులతో పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఇద్దరు సైనికులు మృతి చెందారు.

New Update
2 Assam Rifles Soldiers Killed, 5 Injured In Ambush Near Imphal

2 Assam Rifles Soldiers Killed, 5 Injured In Ambush Near Imphal

మణిపూర్‌ రాజధాని ఇంపాల్‌లో విషాదం చోటుచేసుకుంది. అస్సాం రైఫిల్స్‌ దళాలు వెళ్తున్న వాహనంపై కొందరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. తుపాకులతో పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఇద్దరు సైనికులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన మరో నలుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని భారత సైన్యం తెలిపింది. 

Also Read: దసరా గిఫ్ట్.. భారీగా తగ్గిన పాలు, పెరుగు, నెయ్యి, ఐస్ క్రీం ధరలు.. కొత్త ధరల లిస్ట్ ఇదే!

ఇక వివరాల్లోకి వెళ్తే శుక్రవారం సాయంత్రం ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్‌కు పారామిలిటరీ దళాలు ఓ టాటా వాహనంలో వెళ్తున్నాయి. చురాచంద్‌పూర్‌ మార్గం దగ్గర్లో నంబోల్‌ సబెల్ లీకాయ్‌ ప్రాంతంలో సైనికులే లక్ష్యంగా గుర్తు తెలియని సాయుధులు కాల్పులు జరిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం ఇంఫాల్‌ ఎయిర్‌పోర్టుకు 8 కిలోమీటర్ల దూరంలో జరిగింది. అయితే ఈ దాడులకు పాల్పడింది ఎవరు అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. సైనికులపై జరిగిన దాడిని భారత సైన్యం తీవ్రంగా ఖండించింది. ఇప్పటికే నిందితుల కోసం వేట ప్రారంభించింది. 

Also Read: చైనా, పాకిస్థాన్‌‌లకు షాక్.. UNలో బలుచిస్తాన్‌కు అండగా అమెరికా, బ్రిటన్

ఇదిలాఉండగా ఇటీవల జమ్మూకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. సౌత్ కాశ్మీర్లోని గుదార్ అటవీ ప్రాంతంలో సైనికులు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న క్రమంలో.. ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు యత్నించారరు. దీంతో ప్రతిదాడికి దిగిన సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘర్షణలో ఒక ఉగ్రవాది మృతి చెందాడు. 

భారత్‌-పాకిస్థాన్ సరిహద్దుల్లో ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం ఉంది. అయినా కూడా పాక్‌ ఉగ్రమూకలు కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నాయి. భారత సైన్యం మాత్రం వారి దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలోనే సరిహద్దు ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. 

Advertisment
తాజా కథనాలు