ఇటీవల జమ్మూకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎన్నికలు జరగ్గా జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండు నెలలు కూడా పూర్తికాలేదు. అయిన ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు మొదటి వేతనం అందుకోకపోయినట్లు తెలుస్తోంది.
The salaries and allowances for the MLAs became due from October 10, when the Election Commission notified the names of the elected members. However, some MLAs told DH that they have yet to receive any salary or allowances.https://t.co/HklmntzwDY pic.twitter.com/ji7MIUCXUd
— Deccan Herald (@DeccanHerald) December 23, 2024
ఇది కూడా చూడండి: Baby Bump: పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్.. చైనాలో కొత్త ట్రెండ్
ఎమ్మెల్యేల జీతాలని నిర్ణయించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కే..
శాసనసభ స్పీకర్ అయిన అబ్దుల్ రహీమ్ రాథర్ దృష్టికి ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీనిపై వివరణ ఇవ్వాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీని కోరారు. అయితే జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సొంత అసెంబ్లీ చట్టాన్ని రూపొందించే వరకు ఎమ్మెల్యేల జీతాలని లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయించాలి. కానీ ఎమ్మెల్యే జీతాలు, అలవెన్సులలో మార్పులు ప్రతిపాదించే అధికారం మాత్రం అసెంబ్లీకి ఉంటుందట.
ఇది కూడా చూడండి: YEAR ENDER 2024: దుమ్ములేపిన భారత ఆటగాళ్లు.. ఈ ఏడాది టాప్ 5 క్రీడా విజయాలివే!
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 రద్దయ్యింది. 2019లో ఆర్టికల్ 370 రద్దు కావడంతో జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. దీంతో ఈ ఏడాది తొలి అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఇందులో.. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) విజయం సాధించింది.
ఇది కూడా చూడండి: Food Allergy: ఫుడ్ అలర్జీ డేంజర్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఇది కూడా చూడండి: GOOD NEWS: IAFలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. రూ.10.04 లక్షల ప్యాకేజ్!